Pink Elephant : సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందనున్న రెండో సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ప్రతిభావంతుడైన యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఇది వరకే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు.
Also Read : Kannappa : కన్నప్ప ఓవర్సీస్ రివ్యూ..
Also Read
- Spider Man: భారత్‌లో 'స్పైడర్ మ్యాన్' సునామీ... రూ. 500 కోట్ల క్లబ్‌పై మార్వెల్ కన్ను
- Vijay Varma: హీరో కాకముందు కాస్టింగ్ కౌచ్.. విజయ్ వర్మ షాకింగ్ వ్యాఖ్యలు.. హైదరాబాద్‌లో జరిగిన ఘటన ఏంటి?
- Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
- Mahesh Babu Birthday: మహేష్ బాబు బర్త్‌డేకు ఐకానిక్ బ్లాక్‌బస్టర్ రీరిలీజ్.. మళ్లీ సందడి చేయబోతున్న 'దూకుడు'
ఈ చిత్రంలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్గా నయన్ సారిక నటిస్తుంది. ఆయ్, క వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన జీ5 వారి హలో వరల్డ్, సోనీ లివ్ వారి బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్‌ల్లో ద్వారా తెలుగు కి పరిచయం అయ్యారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా.. సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ రూపొందించనున్న ఈ సినిమాతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఆంగేట్రం చేస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ విషయానికి వస్తే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రధాన పాత్రలో నటించారు. నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.
తాజావార్తలు
-
Spider Man: భారత్‌లో ‘స్పైడర్ మ్యాన్’ సునామీ… రూ. 500 కోట్ల క్లబ్‌పై మార్వెల్ కన్ను
-
AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
-
Vijay Varma: హీరో కాకముందు కాస్టింగ్ కౌచ్.. విజయ్ వర్మ షాకింగ్ వ్యాఖ్యలు.. హైదరాబాద్‌లో జరిగిన ఘటన ఏంటి?
-
Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!