Site icon NTV Telugu

Speaking in English: నవాజుద్దీన్ ఆవేదన!

Nawaz

Nawaz

బాలీవుడ్ లో విలక్షణ పాత్రలకు పెట్టింది పేరుగా సాగుతున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ నుండి వెలుగు చూసిన సిద్ధిఖీ ఇప్పటి వరకూ వైవిధ్యం ప్రదర్శిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. మొదటి నుంచీ థియేటర్ ఆర్టిస్ట్స్ కు సినిమా తారలంటే అంతగా గౌరవం ఉండదు. ఎందుకంటే, నాటకరంగంలో ఎదురుగా ఎంతోమంది ప్రేక్షకుల ముందు ప్రత్యక్షంగా అభినయించే వీలు ఉంటుంది. అదే సినిమాల్లో అయితే కెమెరా ముందు ఎన్ని టేకులైనా తీసుకొని నటిస్తూ ఉంటారు. చివరకు వాటిలో బెస్ట్ టేక్ ను సినిమాలో చొప్పిస్తుంటారు. దాంతో థియేటర్ ఆర్ట్స్ నుండి వచ్చిన వారికి సినీస్టార్స్ అంటే చిన్నచూపే ఉంటుంది. నేడు పెద్ద తెరపైనా, బుల్లితెరపైనా తనదైన బాణీ పలికిస్తోన్న విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సైతం అదే తీరున సాగుతున్నారు. అంతేకాదు, బాలీవుడ్ బడా బాబుల తీరునూ ఆయన తప్పు పడుతున్నారు. బాలీవుడ్ లో ఇప్పుడు హిందీ కంటే ఇంగ్లిష్ లో మాట్లాడే వారే ఎక్కువై పోయారని నవాజుద్దీన్ ఎద్దేవా చేస్తున్నారు.

Exit mobile version