Site icon NTV Telugu

OG -AOR : ఓజీ థియేటర్లలో అనగనగా ఒక రాజు..

Og

Og

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్‌ పొలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒకరాజు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ 4 సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం, షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మధ్య మధ్యలో చిన్న చిన్న అప్‌డేట్స్‌తోనే సరిపెట్టుకుంది. ఇంతకు ముందు రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో (3 నిమిషాల 2 సెకన్ల నిడివితో) నవీన్ స్టైల్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ముకేశ్ మామయ్య.. నీకు వంద రిచార్జులు” అంటూ చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ తరువాత నుంచి సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు.

Also Read: Arjun Das : హస్కీ వాయిస్‌తో విలన్‌గా దుమ్ములేపుతున్న అర్జున్ దాస్ ..బాలీవుడ్‌ ఎంట్రీ

ఇక ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘OG’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. విడుదలకు ముందే 60 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించడం ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపిస్తుంది. ఈ క్రేజ్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించిన ‘అనగనగా ఒకరాజు’ టీం, ‘OG’ థియేటర్లలో తమ ప్రోమోను విడుదల చేయడానికి సిద్ధమైంది. దీంతో పవన్ సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులు నవీన్ పొలిశెట్టి మూవీ గ్లింప్స్ కూడా ఎంజాయ్ చేయనున్నారు. ఈ ప్లాన్‌తో ‘అనగనగా ఒకరాజు’కి మంచి బజ్ క్రియేట్ అవడం ఖాయం.

 

Exit mobile version