Naveen Krishna:లెజెండరీ నటి, నిర్మాత, డైరెక్టర్ విజయనిర్మల గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాగే విజయ నిర్మల వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నరేష్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమధ్య పవిత్ర లోకేష్ తో మళ్ళీపెళ్లి అనే సినిమా తీసి ఎంతగా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. ఇక సినిమాల విషయాలు పక్కన పెడితే నరేష్ కుటుంబ విషయాలు ఎప్పటికప్పుడు వివాదాస్పదంగానే మారుతూనే వచ్చాయి. ముఖ్యంగా అతని మూడో భార్య రమ్య రఘుపతి చేసిన రచ్చ అంతా కాదు. ఇక నరేష్ విషయం పక్కన పెడితే.. నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ గురించి చెప్పుకోవాలి. విజయనిర్మల ఉన్నప్పుడే అతడిని హీరోగా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. నవీన్ సైతం మూడు నాలుగు సినిమాల్లో కూడా నటించాడు. అయితే విజయం అందకపోవడంతో నవీన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. చాలా గ్యాప్ తరువాత ది సోల్ ఆఫ్ సత్య అని మ్యూజిక్ ఆల్బమ్ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్, స్వాతి జంటగా నటించిన ఈ సాంగ్ ఆగస్టు 15న రిలీజ్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సాంగ్ ద్వారా నవీన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక సాంగ్ రిలీజ్ తరువాత చాలా ఇంటర్వ్యూస్ లో తన గురించి, తండ్రి గురించి, తండ్రి పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నవీన్ విజయ్ కృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయనిర్మల ఆస్తి వివరాల గురించి మాట్లాడాడు.
Allu Arjun: పుష్ప 2 కోసం బన్నీ తీసుకున్న రెమ్యూనిరేషన్.. దేవుడా అన్ని కోట్లా.. ?
” నానమ్మ (విజయనిర్మల)కు సంబంధించిన ఆస్తులలో సగభాగం నాకు రాయాలని మా నాన్నను కోరింది. ఆమె అప్పుడే ఆ వీలునామా రాసి ఇస్తానని కూడా చెప్పింది. తన ఆస్తిలో సగభాగం నాకు.. ఇంకో సగభాగం నాన్నకు ఇవ్వాలని ముందే అనుకుంది. అయితే నేనెప్పుడూ ఈ ఆస్తుల గురించి పట్టించుకునే వాడిని కాదు. ఇక కొన్ని రోజుల తర్వాత నేను, నాన్న ఈ ఆస్తి విషయంలో ఒక అవగాహనకు వచ్చాము. ఆ తర్వాత నానమ్మ మొత్తం ఆస్తి మా నాన్న పేరు మీదే రాసింది. ప్రస్తుతం ఈ ఆస్తికి నాన్నే బాస్. ఆయన కూడా నా తర్వాత ఎలాగూ ఈ ఆస్తి నీకే చెందుతుంది కదా అని చెప్తారు. అసలు మా ఆస్తి వివరాలు పై నాకు అంత అవగాహన లేదు. నాకు తెలిసి నాన్న పర్యవేక్షణలోనే మేము ఉండాలని కోరుకుంటున్నాము. నాన్నకు నాకు మధ్య ఆస్తి తగాదాలు ఏమీ లేవు. నేను కానీ.. నాన్న కానీ ఆ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా సంపాదించింది లేదు. అదంతా నానమ్మ ఆస్తి. దానికి నాన్న గార్డియన్ గా మాత్రమే ఉన్నారు. నాన్న తర్వాత ఆ ఆస్తిని భద్రంగా చూసుకునే బాధ్యత నా మీద ఉంది. నాకు నా తమ్ముళ్లు రణవీర్, తేజ ఇద్దరు ఇష్టమే. ముఖ్యంగా తేజ అంటే నాకు ప్రాణం. వాడితో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాను. వాడికి నేనంటే చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇక నవీన్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.