Site icon NTV Telugu

Nani: ‘అష్టాచమ్మా’ జరగకపోతే నేను కూడా ఇదే పరిస్థితిలో ఉండేవాడిని

Nani

Nani

అష్టాచమ్మా చిత్రంతో తెలుగుతెరకు నాని గా పరిచయమయ్యాడు నవీన్ బాబు ఘంటా. రేడియో జాకీగా  కెరీర్ ప్రారంభించి, అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి,  అనుకోని ఒక పరిస్థితిలో నవీన్ నుంచి నాని గా మారాడు. ఇక తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆనతి కాలంలోనే న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పటికి నాని చాలా సార్లు ఈ విషయాన్ని చెప్తూనే ఉంటాడు. అష్టాచమ్మా కనుక జరగకపోయి ఉంటే తాను ఇప్పుడు, ఇక్కడ, ఇలా ఉండేవాడిని కాదు అని, తాజాగా మరోసారి తన గత జీవితాన్ని నెమరువేసుకున్నారు న్యాచురల్ స్టార్. తాజాగా నాని చేతుల మీదుగా ముత్తయ్య టీజర్ రిలీజ్ అయిన విషయం విదితమే.

సినిమానే ప్రపంచంగా, ఒక్కసారివెండితెరపై కనిపించి కన్నుమూసిన చాలు అనుకొనే 74 ఏళ్ల ఒక వృద్ధుడు కథ ‘ముత్తయ్య’.  ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తూ నాని కూడా తనకు దక్కిన అదృష్టాన్ని చెప్పుకొచ్చాడు. “నా 24 ఏళ్ళ వయసులో అష్టాచమ్మా జరగకపోతే నేను నా 70 ఏళ్ళలో  ముత్తయ్యగా ఉండేవాడిని.. టీజర్ ఎంత హృద్యంగా ఉంది. చిత్ర బృందానికి గుడ్ లక్  మరియు అభినందనలు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో మరోసారి నాని గతచరిత్ర గురించి సోషల్ మీడియా లో చర్చ మొదలైంది . నిజమే కదా.. ఆరోజు కనుక ఆ అవకాశం రాకపోయి ఉంటే ఒక మంచి నటుడిని ఇండస్ట్రీ కోల్పోయేది అని కొందరు.. అదృష్టంతో అవకాశం వచ్చినా దాన్ని కష్టంతో నిలబెట్టుకోవడం గొప్ప అన్నా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

Exit mobile version