NTV Telugu Site icon

Sundeep Kishan: ‘మైఖేల్’ కోసం ‘ధరణి’ వస్తున్నాడు…

Micheal

Micheal

యంగ్ హీరో సందీప్ కిషన్ తన తెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘మైఖేల్’. గ్యాంగ్ స్టర్ డ్రామాలో లవ్ ఎమోషన్ మిక్స్ తెరకెక్కిన ఈ మూవీని ఫిబ్రవరి 3న ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నారు. టీజర్, ట్రైలర్ తో మైఖేల్ సినిమాపై అంచనాలు పెంచడంలో చిత్ర యూనిట్ సక్సస్ అయ్యింది. సినిమాటోగ్రఫి టాప్ నాచ్ లో ఉండడం, సేతుపతి-గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి టెర్రిఫిక్ ఆర్టిసులు కలవడంతో మైఖేల్ సినిమా చాలా స్పెషల్ గా మారింది. రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ లవ్ స్టొరీ సినిమా ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మైఖేల్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

Read Also: Taraka Ratna Health : హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తారకరత్న

నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా వస్తున్న మైఖేల్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం JRC కన్వెన్షన్ లో ఆరు గంటలకి స్టార్ట్ అవ్వనుంది. ప్రస్తుతం నాని పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. దసరా టీజర్ రిలీజ్, నాని 30వ సినిమా లాంచ్ ఇలా అనేక కారణాలు నాని పేరుని ట్విట్టర్ ట్రెండ్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో నాని గెస్టుగా రావడం మైఖేల్ సినిమా ప్రమోషన్స్ కి కలిసొచ్చే విషయం. మజిలి సినిమా ఫేమ్ దివ్యాంశ హీరోయిన్ గా నటిస్తున్న మైఖేల్ సినిమాకి ‘సామ్ సీఎస్’ మ్యూజిక్ అందించాడు. కలర్ టోన్ నుంచి డైలాగ్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ వరకూ ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్న చిత్ర యూనిట్ పాన్ ఇండియా సినిమాకి ఉండాల్సిన యూనివర్సల్ కంటెంట్ తోనే మైఖేల్ సినిమా రూపొందింది అనే నమ్మకం కలిగించారు. మరి ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ మైఖేల్ సినిమా సందీప్ కిషన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

Read Also: Nani 30: ‘మెగా’ గ్రాండ్ గా లాంచ్ అయిన నాని నెక్స్ట్ మూవీ…