NTV Telugu Site icon

Nani 32: సుజిత్ తో నాని నెక్స్ట్ సినిమా.. రిలీజ్ అప్పుడేనట

Nani

Nani

Natural Star Nani, Sujeeth, DVV Entertainment’s Nani 32 Announced:”వరుస హిట్‌లతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు. నాని బర్త్‌డే స్పెషల్‌గా టీజర్‌ను విడుదల చేసిన ప్రొడక్షన్ హౌస్ మరో ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే నాని పుట్టినరోజున డబుల్ ట్రీట్‌ను అందిస్తూ బ్యానర్‌లో #Nani32ని ప్రకటించారు. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించనున్న కొత్త చిత్రానికి దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. నిజానికి ఇప్ప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమా చేస్తున్న సుజీత్ తన తదుపరి సినిమా కోసం నానితో కలిసి పని చేయనున్నాడు. సరిపోదా శనివారం షూటింగ్ పూర్తయిన తర్వాత ఇది సెట్స్ మీదకి వెళ్లనుంది.

Operation Valentine : వరుణ్ తేజ్ మూవీ ఈవెంట్ కి గెస్ట్ గా రానున్న మెగాస్టార్..

ఇక “ఇది సుజీత్ సినిమా.🔥 పవర్ తర్వాత… ప్రేమికుడు 😉♥ #Nani32 వస్తాడు” అని నాని కూడా సోషల్ మీడియాలోపోస్ట్ షేర్ చేశారు. ఇక ఒక ఫన్నీ యాక్షన్ రైడ్‌గా రూపొందించబడిన ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో కూడా ద్వారా ప్రకటించబడింది. ఒక హింసాత్మక వ్యక్తి అహింసాత్మకంగా మారినప్పుడు, అతని ప్రపంచం తలక్రిందులుగా మారుతుంది, అదే సినిమా బేసిక్ స్టోరీ లైన్ అని ప్రకటించారు. ఇక #Nani32 2025లో విడుదల అవుతుంది. ప్రాజెక్ట్ కి చెందిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక కేవలం నాని హీరో సుజీత్ దర్శకుడు డీవీవీ బ్యానర్ అని మినహా ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.