NTV Telugu Site icon

Nani: ఛీఛీ.. ఏం సినిమా అది.. తీశావులే బోడి ‘బాహుబలి’ అని రాజమౌళిని అనేసింది

Nani

Nani

Nani: న్యాచురల్ స్టార్ నానికి- దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న స్నేహబంధం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ఈగ అనే సినిమా వచ్చింది. అప్పటినుంచి వీరి రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా కలిసి ఉంటున్నారు. ఇక నానికి హెల్ప్ కావాలన్నప్పుడు రాజమౌళి సాయం చేస్తూ ఉంటాడు. రాజమౌళి, కీరవాణి వారసులకు నాని తనదైన సాయం చేస్తూ ఉంటాడు. తాజాగా కీరవాణి కొడుకు శ్రీసింహా నటించిన ఉస్తాద్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు రాజమౌళితో పాటు నాని కూడా ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఇక ఈ ఈవెంట్ లో నాని జక్కన్న కుటుంబం గురించి మాట్లాడాడు. ఎవరు ఎన్ని రివ్యూలు ఇచ్చినా కూడా కీరవాణి భార్య వల్లి ఇచ్చే రివ్యూలు కోసం ఎదురుచూస్తాను అని తెలిపాడు. రాజమౌళి అయితే బావుంటే బావుందని చెప్తాడు.. బాగోకపోతే అస్సలు ఫోన్ కూడా చేయడు. అదే రమా రాజమౌళి అయితే.. ఎలా ఉన్నా ఓకే అంటారు. కానీ, కీరవాణి భార్య వల్లి అయితే ఛీఛీ.. ఏం సినిమా అది.. అని ముఖం మీద చెప్పేస్తారు. నా విషయంలోనే కాదు బాహుబలి సినిమా రిలీజ్ అప్పుడు నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు రాజమౌళి.. ఇంకోసారి సినిమాకు వెళ్దామా నాని అనగానే.. వల్లి గారు వెంటనే..తీశావులే బోడి సినిమా.. మళ్లీ వెళ్తారా.. ? అని అనేశారు. అలాంటి నిజాయితీ మనుషులు ఉన్న కుటుంబం అది అని చెప్పుకొచ్చాడు.

Anirudh Ravichandran: ఏం తాగి కొడుతున్నావయ్యా.. మ్యూజిక్.. మెంటల్ ఎక్కిపోతుంది థియేటర్ అంతా

“రాజ‌మౌళి అండ్ టీమ్ కొత్త పాత అని సంబంధం లేకుండా అంద‌రినీ ఎంక‌రేజ్ చేస్తుంటారు. నా సినిమాల విష‌యంలో వారెలా స్పందిస్తారోన‌ని ఆలోచిస్తుంటాను. వాళ్లు చెప్పే దాన్ని బ‌ట్టి డిసైడ్ అవుతుంటాను. సింహా విష‌యానికి వ‌స్తే త‌ను గ్రౌండ్ లెవ‌ల్లోనే ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే వాళ్ల ఫ్యామిలీనే అలా ఉంటుంది.
రాజ‌మౌళి ఫ్యామిలీలో అంద‌రూ టెక్నీషియ‌న్సే యాక్ట‌ర్స్ లేర‌ని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు సింహా రూపంలో యాక్ట‌ర్ కూడా వ‌చ్చేస్తున్నాడు. త‌ను కూడా టాప్ పోజిష‌న్‌లో నిలుస్తాడు. కావ్యా క‌ళ్యాణ్ రామ్ మంచి కంటెంట్‌ను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వ‌స్తుంది. మ‌న అని అనుకునే హీరోయిన్స్‌లో త‌ను కూడా నిలుస్తుంది. ఉస్తాద్ అనే పేరులోనే ప‌వ‌ర్ ఉంది. ట్రైల‌ర్‌లో ఎన‌ర్జీ ఉంది. ఉస్తాద్ పాజిటివ్ వైబ్స్‌తో ఆగ‌స్ట్ 12న రిలీజ్ అవుతుంది. శ్రీసింహా కెరీర్‌లో ఉస్తాద్ మెమొర‌బుల్ మూవీ అవుతుందని న‌మ్ముతున్నాను” అంటూ తెలిపాడు. ప్రస్తుతం నాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.