NTV Telugu Site icon

Nani: దసరా సినిమాకి కష్టాలు తప్పేలా లేవు… ఈ గండం నాని ఎలా దాటుతాడో ఏమో?

Dasara

Dasara

నేచురల్ స్టార్ గా తెలుగులో హిట్స్ కొడుతున్న నాని, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. రా అండ్ రస్టిక్ మేకింగ్ తో ఆడియన్స్ దృష్టిలో పడిన దసరా మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో నాని పాన్ ఇండియా హీరో అవుతాడని సినీ అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే నాని దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టడం అంత ఈజీగా కనిపించట్లేదు. దసరా సినిమా రిలీజ్ అవుతున్న మార్చ్ 30నే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘భోలా’ సినిమా రిలీజ్ అవుతోంది. కార్తీ నటించిన ఖైదీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన భోలా సినిమాపై బాలీవుడ్ బాక్సాఫీస్ భారి ఆశలు పెట్టుకుంది. అక్కడి ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం అజయ్ దేవగన్ భోలా సినిమాతో సాలిడ్ హిట్ కోడతాడట. ఈ మూవీ కారణంగా హిందీలో దసరా సినిమాకి కష్టాలు తప్పేలా కనిపించట్లేదు.

నార్త్ లోనే కాదు దసరా సినిమాకి సౌత్ లో కూడా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది. తమిళ్ లో శింబు నటించిన ‘పత్తు తల’ సినిమా మార్చ్ 30న రిలీజ్ కానుంది. కన్నడ సూపర్ స్టార్ శివన్న నటించిన ‘మఫ్టీ’ సినిమాకి రీమేక్ గా ‘పత్తు తల’ తెరకెక్కింది. టీజర్, సాంగ్స్ తో పత్తు తల సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ట్రైలర్ కూడా బయటకి వస్తే పత్తు తల సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మూవీకి ఎక్కువ థియేటర్స్ ఇస్తే దసరా సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కష్టాలని ఫేస్ చెయ్యాల్సి వస్తుంది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా నాని సినిమాకి సోలో రిలీజ్ దొరకట్లేదు. కన్నడలో టాలెంటెడ్ యాక్టర్ ధనంజయ నటించిన ‘హోయిసాలా’ మూవీ మార్చ్ 30న రిలీజ్ షెడ్యూల్ అయ్యి ఉంది. ధనంజయ పోలిస్ గా నటించిన ఈ మూవీ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇలా హిందీలో ‘భోలా’, కన్నడలో ‘హోయిసాలా’, తమిళ్ లో ‘పత్తు తల’ సినిమాల నుంచి ‘దసరా’ సినిమాకి గట్టి పోటీ ఎదురవ్వనుంది. మరి ఈ కాంపిటీషన్ ని దృష్టిలో పెట్టుకోని నాని ‘దసరా’ సినిమా రిల్లెజ్ ని వాయిదా వేస్తాడా లేక కంటెంట్ ని నమ్మి చెప్పిన డేట్ కే మార్చ్ 30న రిలీజ్ చేస్తాడేమో చూడాలి.

Show comments