NTV Telugu Site icon

Natty Kumar: ఆస్కార్ గ్రహీతలకు సన్మానం.. అతను లేకుండా సిగ్గుచేటు

Natty

Natty

Natti Kumar: ఇండియాకు ఆస్కార్ వచ్చింది అని సంతోషిలోపే.. ఆ ఆస్కార్ ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు నడుపుతున్నారు కొంతమంది. అంత పెద్ద గొప్ప అవార్డును తీసుకొచ్చిన వారికి ఏ రేంజ్ లో సన్మానించాలి అనేది అందరికి తెలిసిందే. కానీ, వారికి తగినంత గౌరవాన్ని ప్రభుత్వాలు ఇవ్వలేదని చాలామంది చెప్పుకొస్తున్నారు. తాజాగా అందులో నిర్మాత నట్టి కుమార్ కూడా జాయిన్ అయ్యాడు.రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా నట్టి కేసు వేసి గెలిచిన సంగతి తెల్సిందే. అప్పటినుంచి ఆయన కూడా ఫేమస్ అయ్యాడు. చిత్ర పరిశ్రమలో తనకు నచ్చని విషయాన్ని నిర్మొహమాటంగా మీడియా ముందే చెప్పుకొస్తాడు. ఇక నిన్న ఆస్కార్ గ్రహీతలైన కీరవాణి, చంద్రబోస్ లను శిల్పాకళావేదికలో తెలుగ చలన చిత్ర పరిశ్రమ తరుపున సన్మానించిన సంగతి తెలిసిందే. అసలు ఈ వేడుక జరిగినట్లు కూడా చాలామందికి తెలియదు. ఇదే విషయాన్ని నట్టి కుమార్ తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. వీరిని సన్మానించే పద్దతి ఇది కాదని విమర్శించాడు.

Samantha Hoopes: ఆ స్విమ్ షూట్ ‘ఫ్రెండ్షిప్ బ్రాస్లెట్’ లాంటిదట!

“తెలుగు సినిమాకి అస్కార్ రావడం అందరూ గర్వించదగ్గ విషయం. కానీ ఆస్కార్ గ్రహీతలకు సరైన గౌరవం దక్కలేదు. నిన్న జరిగిన ఈవెంట్ కి ఏపీ ప్రభుత్వ పెద్దలు రాలేదు. కేవలం సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చారు. Fdc ఛైర్మెన్, టూరిజం మినిష్టర్ ఎందుకు రాలేదు అని అడుగుతున్నా?. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ..ఏపీ ప్రభుత్వాలతో ఎందుకు సంప్రదించలేదు. ఈసీ అప్రూవల్ లేకుండా కౌన్సిల్ నుంచి 25 లక్షలు తీసి ఎలా ఖర్చు చేస్తారు?. ఆస్కార్ అవార్డ్స్ సాధించిన వాళ్ళని అంత అర్జెంట్ గా ఎవరికి తెలీకుండా ఎందుకు సన్మానించారు?. అసలు ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యను ఈవెంట్ కు పిలవకుండా సన్మానం చేయడం సిగ్గుచేటు. ఇది పద్దతి కాదు. తెలంగాణ వచ్చాక సినీ పరిశ్రమకి అది చేస్తాం. ఇది చేస్తామని కబుర్లు చెప్పారు మంత్రి శ్రీనివాస గౌడ్ కానీ చిన్న సినిమాలకు ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు అందించలేదు. పెద్ద సినిమాలకు మాత్రమే గుర్తింపు వస్తుంది. చిన్న సినిమాలకు ఐదో షో కావాలని అడుగుతున్నాం. ఈ అంశాన్ని పట్టించుకునే వారే లేరు. తెలంగాణలొనే ఎక్కువ లాభాలు వస్తున్నాయి అని శ్రీనివాస్ గౌడ్ అన్నాడు కానీ ఇక్కడ 32% వస్తుంది. ఏపీ లో 68% వస్తుంది.అయినా చాలా కంపెనీలు తెలంగాణలోనే జీఎస్టీ కడుతున్నాయి. సినీ పరిశ్రమలో ఏపీ-తెలంగాణ అంటూ ఎలాంటి విబేధాలు లేవు. అందరం కలిసే ఉన్నాం. కానీ కొందరు నాటకాలతో ఈ విధానం తప్పు దారి పడుతుందని” అని చెప్పుకొచ్చాడు.