Telugu Winners List for National Film Awards 2025: 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితాలను న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జ్యూరీ ప్రకటిస్తోంది. 2023 సినిమాలకు గానూ ఈ పురస్కారాలను జ్యూరీ సభ్యులు ప్రకటిస్తున్నారు. ‘హను-మాన్’ సినిమాను రెండు అవార్డులు వరించించాయి. ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ), బెస్ట్ ఫిల్మ్ (యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్) అవార్డులు దక్కాయి. ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’ సినిమాలో ‘ఊరు పల్లెటూరు’ పాటకు కాసర్ల శ్యామ్ అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్) అవార్డును బేబీ సినిమాకు గాను సాయి రాజేశ్ నీలం ఎంపికయ్యారు.
చైల్డ్ ఆర్టిస్ట్ సుకృతి వేణికి జాతీయ అవార్డ్ దక్కింది. గాంధీ తాత చెట్టు సినిమాకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ సొంతం చేసుకుంది. సుకృతి డైరెక్టర్ సుకుమార్ కూతురు అన్న విషయం తెలిసిందే. బేబీ సినిమాలో ప్రేమిస్తున్న పాటకు బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు దక్కింది. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు జీవీ ప్రకాశ్ కుమార్‌ను వరించింది. వాతి (తమిళ్) సినిమాకు ఈ అవార్డు దక్కింది.
Also Read: National Film Awards 2025: జై బాలయ్య.. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’!
తెలుగువాళ్లకు వచ్చిన జాతీయ అవార్డులివే:
బెస్ట్ తెలుగు ఫిల్మ్: భగవంత్ కేసరి (తెలుగు) అనిల్ రావిపూడి
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్: హనుమాన్ నందు పృథ్వీ
బెస్ట్ లిరిక్స్: బలగం ఊరు పల్లెటూరు, కాసర్ల శ్యామ్
బెస్ట్ స్క్రీన్ ప్లే: బేబీ, సాయి రాజేష్
బెస్ట్ మేల్ సింగర్: బేబీ ప్రేమిస్తున్నా, రోహిత్ విపిఎస్ఎన్
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతి వేణి బండ్రెడ్డి, గాంధీ తాత చెట్టు
బెస్ట్ ఫిల్మ్: యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్: హనుమాన్
