Site icon NTV Telugu

Poonam Kaur : యూట్యూబర్లకు వార్నింగ్… చర్యలు తప్పవు !

poonam

టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ చాలా రోజుల తరువాత “నాతిచరామి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా త్వరలోనే ఓటిటిలో విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పూనమ్ కౌర్ ఎమోషనల్ అయ్యింది. ఆ ఫోటోలను వాడుకుని కొంతమంది యూట్యూబర్లు తమ ఛానల్స్ లో థంబ్ నెయిల్స్ గా ఉపయోగించిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ “నాతిచరామి” టీమ్స్ వార్నింగ్ ఇచ్చింది.

Read Also : Poonam Kaur : కొంతమంది నా కెరీర్‌ని నాశనం చేశారు…

“యూట్యూబ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. తాజాగా జరిగిన నాతిచరామి మూవీ ప్రెస్ మీట్ వీడియోలపైన ఎవరైతే అసభ్యకరంగా థంబ్ నెయిల్స్ వాడారో… వారందరి థంబ్ నెయిల్స్ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టాము. సో మాట్లాడని విషయాలను వక్రీకరించి థంబ్ నెయిల్స్ పెట్టిన అందరిపైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాము” అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇక యూట్యూబ్ లలో నేను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతా అనుకున్నా… ఆడదాన్ని అలా నాశనం చేస్తే వాడు నాశనం అయిపోతాడు అంటూ థంబ్ నెయిల్స్ ఉపయోగించారు.

Exit mobile version