Site icon NTV Telugu

Nassar: పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పు.. అలాంటి రూల్స్ ఏం లేవు

Pawan

Pawan

Nassar:తమిళ చిత్ర పరిశ్రమకు పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు, సలహాలు చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ.. “తమిళ పరిశ్రమలోకి ఇతర భాషల వాళ్లను రానివ్వండి.. అప్పుడే ఎదిగే అవకాశం ఉంటుంది.. ఎంత వరకు అలా నిబంధనలు పెట్టుకుని ఉంటామో.. అంత వరకు పైకి ఎదగలేమంటూ” పవన్ కళ్యాణ్ సూచించారు. సినిమా రంగం ఎదుగుతుంది అని.. ఇప్పుడంతా పాన్ ఇండియా అంటున్నారు కానీ, కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని ఏం లేదని, కొన్నిరోజులుగా బయట తమిళ్ వాళ్ళు మిగతా భాషా నటులను రానివ్వడంలేదని చెప్పుకోవడం నేను విన్నాను.. దయచేసి అలాంటి రూల్స్ ఉంటే సరిచేసుకోండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పవన్ వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీ వరకు వెళ్లాయి. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ఖండించారు. అలాంటి నిబంధనలు ఎక్కడా లేవని అసలు విషయాన్ని వివరించాడు.

Prabhas FB Hacked: బిగ్ బ్రేకింగ్.. ప్రభాస్ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్.. ఆ పోస్టు షేర్ చేసి?

నాజర్ మాట్లాడుతూ.. “సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ సమాచారం తప్పుగా ప్రచారం అవుతోంది. తమిళ పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే రూల్స్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. అలాంటి నిబంధన తీసుకు వస్తే ముందు నేనే దాన్ని ఖండిస్తాను. దాన్ని వ్యతిరేకిస్తాను. సినిమా పరిశ్రమ, కళాకారులు అనే వాళ్లకు సరిహద్దులు ఉండవు. దీన్ని ఎవరో కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నా సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు. ఆయనకు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించి ఉంటారు. తమిళ సినీ కార్మికుల కోసం సెల్వమణి గారు కొన్ని సూచ‌న‌లు చేశారు. తమిళ్ సినిమా చేస్తున్నప్పుడు తమిళ టెక్నీషియన్లు పెట్టుకోండని అన్నారు. అంతే కానీ ఇతర భాషల వ్యక్తులని వద్దని ఎవ్వరూ చెప్పలేదు. ఇప్పుడు ఒక భాష అని ఏం లేదు. అన్నీ కూడా ప్యాన్ ఇండియన్ సినిమాలు అయ్యాయి. ఓటీటీ వినియోగం ఎక్కువైంది. ఇలాంటి టైంలో అలాంటి నిబంధనలు ఎవరు తీసుకొస్తారు. ఇతర భాషల నుంచి వచ్చిన ఎంతో మంది ఆర్టిస్టులను, టెక్నీషియన్లను తమిళ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. వారిని ఆదరించింది. ఎస్వీ రంగారావు గారు, సావిత్రి గారు, వాణీ శ్రీ గారు, శారద అమ్మ గారు ఇలా చాలా మంది తమిళులే అని అనుకున్నాను. చాలా కాలం తరువాత నాకు వాళ్లది ఆంధ్రా అని తెలిసింది. కాబట్టి ఇప్పుడు వస్తున్న ప్రచారానికి అర్థం లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన సినిమాల గురించి ఎదురుచూస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌ల కంటే పెద్ద సినిమాలను మనమందరం కలిసి తీద్దాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version