Site icon NTV Telugu

Gymkhana : బాలయ్య ఫ్యాన్స్ పై డైలాగ్.. జింఖానా తెలుగు ట్రైలర్ రిలీజ్..

Gymkhana

Gymkhana

Gymkhana :యూత్ ను బాగా ఆకట్టుకున్న ప్రేమలు సినిమాను ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఈ సినిమా హీరో నస్లెన్ తాజాగా ‘జింఖానా’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ మళయాలంలో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 25న ఈ మూవీ తెలుగులో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా తెలుగులో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇక ట్రైలర్ ను చూస్తుంటే.. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో యూత్ ను ఎంటర్ టైన్ చేసే కోణంలో తీసినట్టు తెలుస్తోంది.
Read Also : Actor Ali: అలీకి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు

బాక్సింగ్ కోసం కష్టపడే కొందరు కుర్రాళ్ల జీవితాలను బేస్ చేసుకుని ఈ మూవీని తీశారు. సినిమాను యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. బాక్సింగ్ ను టైమ్ పాస్ కోసం స్టార్ట్ చేసిన వారు.. చివరకు దాన్ని ఓ పాషన్ గా మార్చుకుంటే ఏం జరుగుతుంది అనేది మూవీ లైన్. ఇందులో కామెడీకి ఎక్కువగా స్పేస్ ఇచ్చారు. డైరెక్టర్ ఖలీడ్ రెహమాన్ సినిమాను తెరకెక్కించిన విధానం కొత్తగా అనిపిస్తోంది. ఇందులో ‘ఇంత కన్నా ఎక్కువ భరిస్తే బాలయ్య బాబు ఫ్యాన్స్ కే అవమానం’ అనే డైలాగ్ కూడా పెట్టేశారు. మొత్తంగా మరోసారి యూత్ ను టార్గెట్ చేసుకుని నస్లెన్ ఈ సినిమా చేశారని అనిపిస్తోంది. లుక్మాన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్, అనఘ మాయ రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version