Site icon NTV Telugu

మొఘల్స్ పై ప్రముఖ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు… దారుణంగా ట్రోలింగ్

Naseeruddin-Shah

మొఘలులపై ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వరుస వివాదాలతో సతమతమవుతున్నారు. సినిమాలే కాకుండా నసీరుద్దీన్ షా ఏ సమస్యపై మాట్లాడినా తరచూ వివాదాలకు తావిస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒకటి జరగడంతో మరోసారి నసీరుద్దీన్ షాపై నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. తన ఇటీవలి ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా మొఘల్స్ ను శరణార్థులుగా వర్ణించాడు. భారతదేశాన్ని తమ మాతృభూమిగా మార్చడానికే మొఘలులు వచ్చారని ప్రముఖ నటుడు పేర్కొనడం వివాదాస్పదంగా మారింది.

https://ntvtelugu.com/sonam-kapoor-slams-bjp-mla-sudhir-mungantiwars-remarks-on-lgbtq-community/

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నసీరుద్దీన్ షా మాట్లాడుతూ మొఘలుల గురించి వివిధ వాదనలు చేయడం కన్పిస్తోంది. వీడియోలో నసీరుద్దీన్ షా ‘మొఘలుల దురాగతాలు అంటూ కొన్ని సంఘటనలు బట్టబయలు అవుతున్నాయి. మొఘలులు దేశం కోసం దోహదపడిన వ్యక్తులని మనం మర్చిపోతున్నాము. దేశంలో శాశ్వత స్మారక చిహ్నాలను విడిచి పెట్టిన వ్యక్తులు, నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం సంప్రదాయాన్ని అందించిన వారు. మొఘలులు తమ మాతృభూమిగా చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కావాలంటే మీరు వారిని శరణార్థులు అని పిలవవచ్చు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వీడియో చూసిన నెటిజన్లు నసీరుద్దీన్ షాపై మండిపడుతున్నారు.

సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు కూడా నసీరుద్దీన్ షాను టార్గెట్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోను ఎం.నాగేశ్వరరావు పంచుకుంటూ “మొఘలులు అనాగరిక ఆక్రమణదారులు… వారు హిందూ నాగరికత, మతం, జనాభా, సంస్కృతి మొదలైనవాటిని నాశనం చేశారు. పాక్, బీడీ, భారతదేశం ఎదుర్కొంటున్న అనేక ఇతర సమస్యల సృష్టికి మూల కారణం వారే. మీరు వారిని సెటిలర్లు లేదా శరణార్థులు అని పిలుస్తారా? ఇది మీకు అవమానకరం” అంటూ మండిపడ్డారు.

Exit mobile version