NTV Telugu Site icon

Narne Nithin: ఆయ్.. ఎన్టీఆర్ బామ్మర్ది ఈసారి కూడా హిట్ కొట్టేటట్టు ఉన్నాడే

Aay

Aay

Narne Nithin: మ్యాడ్ సినిమాతో నార్నే నితిన్ మంచి హిట్ ను అందుకున్నాడు. ఎన్టీఆర్ బామ్మర్దిగా శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమవుతాడు అనుకున్నారు. మరి ఆ సినిమా ఏమైందో తెలియదు కానీ, మ్యాడ్ సినిమాతో మనోడు ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా నితిన్ కు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఇక దీంతో ఆ హిట్ ను కాపాడుకోవడానికి మంచి మంచి కథలను ఎంచుకోవడంతో పాటు మంచి బ్యానర్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న చిత్రం ఆయ్ .. మేము ఫ్రెండ్స్ అండి అనేది ట్యాగ్ లైన్. అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీవాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నితిన్ సరసన నయన్ సారిక నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం పెట్టారు. సూఫీయానా.. గుండెల్లోనా అంతో సాగే ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ మ్యూజిక్ సెన్సేషన్ రామ్ మిరియాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ ప్రోమోలో గోదావరి మధ్యలో పడవలో నితిన్.. హీరోయిన్ అందం గురించి వివరిస్తున్నట్లు కనిపించింది. విజువల్స్ ఎంతో అద్భుతంగా కనిపించాయి. మార్చి 20 న ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మ్యూజిక్ , పోస్టర్స్ ను బట్టి ఈసారి కూడా ఎన్టీఆర్ బామ్మర్ది హిట్ కొట్టేలానే ఉన్నాడని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి నార్నే నితిన్ రెండో సినిమాతో హిట్ అందుకుంటాడో చూడాలి.

Show comments