నటుడు నరేష్, పవిత్రా లోకేష్ ఇటీవల నటించిన మళ్లీ పెళ్లి సినిమాను వివాదాలు వదలడం లేదు. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నుంచే ఈ సినిమా మీద కేసులు నమోదు చేస్తూ వస్తోంది నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి. ఈ సినిమాలో చిత్రనిర్మాతలు తన పాత్రను చెడుగా చూపించారని నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా OTTలో ప్రసారం అవుతుండగా మరోసారి రమ్య వార్తల్లోకి వచ్చింది. తాజా సమాచారం మేరకు OTT ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వీడియో రెండింటిలో మళ్లీ పెళ్లి సినిమా విడుదలను నిరోధించాలని నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
Megastar: ఆరోజు వెయ్యి మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు.. చిరంజీవి కీలక ప్రకటన
ఈ కోర్టు సమస్య కారణంగా, ప్రైమ్ ఈ సినిమాను రిలీజ్ చేయలేదు, ఈ క్రమంలో ఆహా వీడియోలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మళ్లీ పెళ్లి, నరేష్, పవిత్ర, రమ్యల వ్యక్తిగత జీవితాలను ఆధారంగా చెసుకుని తీసిన సినిమానే అయినా నరేష్ మాత్రం ఈ సినిమాకి తమ జీవితాలకు ఎలాంటి సంబంధం లేదని, ఇదొక కల్పిత చిత్రమని ప్రకటించారు. నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమాకు ప్రముఖ నిర్మాత, ఈ మధ్యనే దర్శకుడుగా మారిన ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత నెలలో థియేటర్లలో విడుదలైంది, విమర్శకులు – ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. నరేష్, పవిత్రా లోకేశ్‌ల నిజ జీవితంలో జరిగిన సంఘటనల నుంచి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో జయసుధ, శరత్ బాబు, వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటించారు. సురేష్ బొబ్బిలి, అరుల్ దేవ్ సంగీతం అందించిన ఈ సినిమాను విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నటుడు నరేష్ నిర్మించారు.
Ramya Raghupathi: మళ్లీ పెళ్లి స్ట్రీమవుతున్న OTTలకు లీగల్ నోటీసులు
Show comments