Naresh- Pavitra: సీనియర్ జంట నరేష్- పవిత్ర పెళ్లి వార్త.. సోషల్ మీడియాలో ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. అందుకు కారణం నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి. ఆమె నరేష్ తో తనకు విడాకులు వద్దు అని పోరాడుతూ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ నరేష్ బండారాన్ని బయటపెడుతోంది. అసలు నరేష్ ను పవిత్ర ఏమి చూసి ఇష్టపడింది.. ఎందుకు వీరిద్దరూ ఈ వయస్సులో పెళ్లి చేసుకుంటున్నారు.
రమ్య ఎందుకు ఇంకా విడాకులు ఇవ్వకుండా ఉంది.. ప్రస్తుతం అభిమానుల మనస్సులో మెదులుతున్న ప్రశ్నలు.. వీటన్నింటికి రమ్య సమాధానం చెప్పుకొచ్చింది. నరేష్ ను తన వెంట రెండేళ్లు తిరిగి పెళ్లి చేసుకున్నాడని, తానూ కూడా అతడ్ని ప్రేమించి ఇంట్లోవాళ్ళు కాదన్నా వివాహం చేసుకున్నట్లు ఆమె తెలిపింది. నరేష్ కు ఇప్పటివరకు చాలా ఎఫైర్లు ఉన్నాయని, అవి తనకు కూడా తెలుసనీ చెప్పిన రమ్య.. ఆ విషయం తెలిసి అతడిని అడిగినప్పటి నుంచి రెండు నెలలు తనతో ప్రేమగా ఉంటాడని, ఇక ఆ విషయం మర్చిపోయిన వెంటనే మళ్లీ మొదలుపెడతాడని చెప్పుకొచ్చింది.
Read Also: Naresh- Pavitra: నరేష్ తో పవిత్ర ఎఫైర్.. అందుకే పెట్టుకొందన్న రమ్య
ఇక నరేష్- పవిత్ర సమ్మోహనం సినిమా ద్వారా పరిచయమయ్యారట.. ఆమెను డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేశారు. నేను కూడా పవిత్రను ఎంతో ఆప్యాయంగా పలకరించి అన్ని మర్యాదలు చేశాను. ఆ తరువాత కొన్ని రోజులకు ఒక ప్రైవేట్ పార్టీకి వీరిద్దరూ వెళ్లినట్లు తెలిసి అనుమానం వచ్చి నరేష్ ను అడిగాను. అప్పుడు అదేం లేదని, నాలుగు రోజులు నాతో మంచిగా ఉన్నాడు. ఆ తరువాత నేను పట్టించుకోలేదు. అప్పుడే నరేష్- పవిత్ర దగ్గరయ్యారు. నరేష్ దగ్గర డబ్బు ఉంది.. అందుకే అతడి వెనుక పవిత్ర పడుతోంది.నరేష్ కు అమ్మాయిలు అంటే పిచ్చి.. ఇక దాంతోనే ఆమెకు దగ్గరయ్యాడు. వీరిద్దరి గురించి తెలిసినా నేను విడాకులు ఇవ్వలేను.. ఎందుకంటే .. నా పదేళ్ల కొడుకు తండ్రి కావాలని కోరుకుంటున్నాడు. అతడికి తండ్రి ప్రేమ ఇవ్వడం కోసమే నరేష్ తో విడాకులు తీసుకోవడంలేదు. ఎప్పటికీ తీసుకోను కూడా.. నాకు విడాకులు ఇవ్వకుండా వాళ్లు ఎలా పెళ్లి చేసుకొంటారో చూస్తాను అని ఆమె చెప్పుకొచ్చింది.
