Site icon NTV Telugu

Naresh: కృష్ణ అంత్యక్రియల్లో నరేష్ ఓవరాక్షన్.. సాలు ఊకో ఇగ అన్న కేసీఆర్

Naresh

Naresh

Naresh: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిన్నటితో ముగిశాయి. ఇప్పటికి కృష్ణ మరణవార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ కడసారి చూపు కోసం అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తహతహలాడారు. కృష్ణ అంత్యక్రియల్లో ఎక్కువగా కనిపించింది సీనియర్ హీరో నరేష్. ఆయన తన ప్రేయసి పవిత్రా లోకేష్ తో కృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. కృష్ణ అంత్యక్రియల్లో నరేష్ కొంచెం ఓవరాక్షన్ చేశాడని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అన్ని తానే దగ్గరుండి చూసుకున్నట్లు హడావిడిగా తిరగడం, వచ్చిన వారందరిని దగ్గరుండి లోపలి తీసుకెళ్లడం లాంటివి కొన్ని వీడియోస్ లో కనిపించాయి. ఇక అలాంటి వీడియోస్ లో కేసీఆర్, మహేష్ బాబును ఓదార్చిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇక ఈ వీడియోలో నరేష్ యాక్షన్ కు కేసీఆర్ రియాక్షన్ అద్భుతమని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వీడియోలో కేసీఆర్.. కృష్ణకు నివాళులు అర్పించిన అనంతరం మహేష్, నమ్రతను ఓదారుస్తున్నారు. ఇంతలోనే నరేష్, మహేష్ పట్టించుకోకపోయినా ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడు. అది గమనించిన కేసీఆర్, నరేష్ చేతిని వెనక్కి నెట్టి సాలు ఊకో ఇగ అన్నట్లు సైగ చేశారు. ఇంకేముంది కేసీఆర్ చెప్పినప్పుడు ఆగకపోతే బాగోదనుకున్నాడో ఏమో నరేష్ మౌనంగా నిలబడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకూ నరేష్, మహేష్ తో ఏం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అనేదానిమీద నెటిజన్స్ తమదయాన్ రీతిలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version