Nara Rohith : సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు అయినా నారా రోహిత్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. గత మే నెలలోనే భైరవం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా సుందరకాండ అనే సినిమా వస్తోంది. వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కిస్తుండగా.. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు రోహిత్. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. చాలా రోజుల నుంచి రోహిత్ మీద ఓ అలిగేషన్ ఉంది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన మెయిన్ హీరోగా సినిమాలు చేస్తారనే ప్రచారం ఉంది.
Read Also : Nara Rohith : నా ఇంటిపేరుతోనే జనాలకు సమస్య.. నారా రోహిత్ కామెంట్స్
ఒకవేళ టీడీపీ అధికారంలో లేకపోతే హీరోగా కాకుండా గెస్ట్ రోల్స్ లాంటివి చేస్తాడనే టాక్ ఉండేది. దానిపై నారా రోహిత్ క్లారిటీ ఇచ్చారు. ఇది నేను కూడా ఎప్పటి నుంచో వింటున్నాను. అదేంటో నాకు కూడా అర్థం కాదు. సుందరకాండ సినిమాను మేం 2023లో మొదలు పెట్టాం. అది ఇప్పుడు పూర్తి అయింది. మేం మొదలు పెట్టినప్పుడు టీడీపీ అధికారంలో లేదు కదా. అలాగే ప్రతినిధి సినిమా కూడా నేను 2012లో మొదలు పెట్టాను. అది 2014లో వచ్చింది. చాలా సినిమాలు మేం స్టార్ట్ చేసిన ఏడాదిలోనే రావు కదా అండి. అందుకే లేట్ అవుతుంది. అందరూ రిలీజ్ అవుతున్న డేట్లు మాత్రమే చూస్తారు. కానీ అవి ఎప్పుడు స్టార్ట్ చేశామో వారికి తెలియదు కదా. అందుకే ఇలా అనుకోవడంలో పెద్ద అనుమానమేమీ లేదు అని చెప్పుకొచ్చారు నారా రోహిత్.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ కు షాక్.. రోజుకు కోటిన్నర నష్టం..?
