Site icon NTV Telugu

Nara Rohith : నారా రోహిత్‌- శిరీష.. హల్దీ వేడుక వీడియో చూశారా..!

Nra Rohith Wedding

Nra Rohith Wedding

టాలీవుడ్‌ యంగ్ హీరో నారా రోహిత్ జీవితంలో ఆనంద ఘడియలు మొదలయ్యాయి. సినిమాల్లో సీరియస్ పాత్రలతో ఆకట్టుకున్న రోహిత్‌, ఇప్పుడు తన నిజ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాడు. ‘ప్రతినిధి 2’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సిరి లెల్లనే తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. ఇద్దరి వివాహం అక్టోబర్‌ 30న, రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ శుభకార్యానికి హాజరవుతారని సమాచారం.

Also Read : Yugani Kokkadu 2 : యుగానికొక్కడు 2’పై సెల్వ రాఘవన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

వివాహ వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు సాగనున్నాయి. అక్టోబర్‌ 25న హల్దీ వేడుకతో వేడుకలు ప్రారంభమవ్వగా, అక్టోబర్‌ 26న సంప్రదాయ పెళ్లికొడుకు కార్యక్రమం, అక్టోబర్‌ 28న మెహందీ వేడుక జరగనుంది. ఇప్పటికే హల్దీ వేడుక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పసుపు రంగులతో కళకళలాడిన వేదిక, నవ్వులు పూయించిన వేడుకల మధ్య రోహిత్‌, సిరి జంట అందరి దృష్టిని ఆకర్షించారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు పాల్గొని ఈ వేడుకను మరపురానిదిగా మార్చారు.

గతేడాది అక్టోబర్‌ 13న రోహిత్‌–సిరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ వేడుకకు నారా కుటుంబ సభ్యులతో పాటు, మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి, మరియు అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. అసలైన వివాహం గత సంవత్సరం డిసెంబర్‌లో జరగాల్సి ఉండగా, రోహిత్‌ తండ్రి నవంబర్‌ 16న ఆకస్మికంగా కన్నుమూయడంతో పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడీ జంట పెళ్లి సందడిలో తళుక్కుమంటుంది. అభిమానులు, సినీ వర్గాలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, రోహిత్ కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

 

Exit mobile version