Prathinidhi 2 : ఎన్నికల్లోపే ప్రతినిధి కూడా.. ఆరోజే రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prathinidhi 2: హీరో నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ సినిమాను వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా నారా రోహిత్ తన ఇంటెన్స్ నటనతో ఆశ్చర్యపరిచాడు. మూర్తి రచన, దర్శకత్వంకు మంచి ప్రశంసలు రాగా ఈ టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో ఆనందం వ్యక్తం చేసిన మేకర్స్, ఉగాది శుభ సందర్భంగా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ప్రతినిధి 2 ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు.
Pushpa 2 Teaser: ఇది కదా అరాచకం అంటే.. తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న పుష్ప రాజ్!
Also Read
అయితే ఏపీ ఎన్నికలను టార్గెట్ చేసిన ఈ సినిమా ఎన్నికలకు ముందే డేట్ సెట్ చేసుకుంది. ఇక ప్రతినిధి 10 సంవత్సరాల క్రితం 2014లో కూడా ఇదే తేదీన విడుదల కావడం విశేషం. విడుదల తేదీ పోస్టర్లో రోహిత్ సిల్హౌట్ ఇమేజ్ ను మనం చూడవచ్చు, ఇక్కడ ప్రజల ఒక వైపు చేతులు ఎత్తడం, మరొక వైపు అల్లర్ల పరిస్థితి కూడా చూడవచ్చు. బ్యాక్ గ్రౌండ్ లో దినపత్రికలు, కథనాల విభిన్న ముఖ్యాంశాలు కనిపిస్తున్నాయి. ఇక రిలీజ్ డేట్ కి 15 రోజులే ఉండడంతో సినిమా యూనిట్ ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ‘ప్రతినిధి 2’ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారు. సిరీ లెల్లా కథానాయికగా నటిస్తుండగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాని చమిడిశెట్టి డీవోపీగా చేస్తుండగా, యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!