Site icon NTV Telugu

Nara Brahmani: మా నాన్నలా డైలాగ్స్ చెప్పే హీరో దేశంలోనే లేడు..

Nara Brahmani

Nara Brahmani

Nara Brahmani: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. నందమూరి నట సింహం రికార్డ్ కలెక్షన్లతో ఊచకోత మొదలు పెట్టేశాడు. ఇక ఈ సినిమాను అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా వీక్షిస్తూ తమ తమ రివ్యూలను తెలుపుతున్నారు. ఇక తాజాగా బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి .. వీరసింహారెడ్డి సినిమాను అభిమానుల మధ్య కూర్చొని వీక్షించింది. హైదరాబాదులోని కూకట్ పల్లిలో వీరసింహారెడ్డిని వీక్షించిన బ్రాహ్మణి.. సినిమా అనంతరం తన రివ్యూ ఇచ్చింది.

సినిమా చాలా బావుందని, అభిమానులకు నచ్చుతుందని తెలిపింది. తన తండ్రి సినిమాను అభిమానులతో వీక్షించడమే తనకు ఇష్టమని చెప్పిన బ్రాహ్మణి.. బాలకృష్ణ నటనను ఆకాశానికి ఎత్తేసింది. తన తండ్రిలా డైలాగ్స్ చెప్పడం దేశంలో ఎవరి వలన కాదని, అలాంటి నటుడు దేశంలో ఒక్కడే ఉంటాడని చెప్పుకొచ్చింది. పర్సనల్ గా వీరసింహారెడ్డి తనకు చాలా నచ్చిందని, నాన్న లుక్ బావుందని చెప్పింది. ప్రత్యేకంగా రాయలసీమను ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించడం తనకు బాగా నచ్చిందని, ప్రతి సంక్రాంతికి నాన్నగారు ఎలాంటి కనుక ఇస్తారో ఈసారి కూడా వీరసింహారెడ్డితో మంచి కానుక ఇచ్చారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బ్రాహ్మణి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version