NTV Telugu Site icon

Animal Song: నాన్నకు ప్రేమతో… ఏ సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్

Animal

Animal

అర్జున్ రెడ్డి సినిమాతో ఇంటెన్స్ లవ్ స్టోరీని ఆడియన్స్ కి ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే కల్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒక ప్రేమకథని తన స్టైల్ లో ప్రెజెంట్ చేసిన సందీప్ రెడ్డి వంగ… అర్జున్ రెడ్డి తర్వాత అంత కన్నా ఇంటెన్స్ కథతో చేస్తున్న సినిమా అనిమల్. బాలీవుడ్ ప్రిన్స్ రణబీర్ కపూర్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ ని ఇప్పటికే మొదలుపెట్టిన సందీప్ రెడ్డి వంగ, అనిమల్ టీజర్ అండ్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తున్నాడు.

లేటెస్ట్ గా అనిమల్ నుంచి ‘నాన్న నువ్ నా ప్రాణం’ అనే సాంగ్ బయటకి వచ్చింది. ఈ సాంగ్ లో రణబీర్ కపూర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న అనిల్ కపూర్ కి మధ్య ఉన్న బాండింగ్ ని చూపించే ప్రయత్నం చేసాడు సందీప్. బిజినెస్ లో పడి బిజీగా ఉండే తండ్రి, అతని ప్రేమకి దూరమైన ఒక కొడుకు మధ్య సాంగ్ ని బాగా డిజైన్ చేసారు. తండ్రికి సమస్య వచ్చినప్పుడు కొడుకు ఎలా నిలబడ్డాడు అనేది సాంగ్ ని ఎమోషనల్ గా ప్రెజెంట్ చేసాడు సందీప్. ఇప్పటివరకూ అనిమల్ మూవీ యాక్షన్ మోడ్ లో ఉంటుంది అనుకున్న వాళ్లకి ఒక్క సాంగ్ తో ఫ్యామిలీ టచ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. తెలుగు లిరిక్స్ ని అనంత శ్రీరామ్ రాయగా… అన్ని భాషల్లో ఈ పాటని సోను నిగమ్ పాడాడు. ఇతని వాయిస్ సాంగ్ ని మరింత ఎలివేట్ చేసింది.