Site icon NTV Telugu

విడుదలకు ముందే లాభాల్లో “టక్ జగదీష్”

Release date locked for Nani’s Tuck Jagadish

“మజిలీ” ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామా “టక్ జగదీష్”. నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, జగపతి బాబు, ఐశ్వర్య రాజేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందించారు. ప్రసాద్ మురెల్లా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే లాభాలు తెచ్చినట్టు టాక్. అత్యంత హైప్ నెలకొన్న మూవీ “టక్ జగదీష్” అప్పుడే రూ.51.5 కోట్లు సంపాదించాడు. ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం చేస్తారు. ఈ మూవీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ రైట్స్ కు మాత్రమే రూ. 37 కోట్లు వచ్చాయి. ఆడియో, శాటిలైట్, డబ్బింగ్ హక్కులను విక్రయించడం ద్వారా “టక్ జగదీష్” ఖాతాలో మరో రూ.14.5 కోట్లు పడినట్లు తెలుస్తోంది.

ఓటిటి అమెజాన్ – రూ.37 కోట్లు
శాటిలైట్ హక్కులు స్టార్ మా – రూ.7.50 కోట్లు
ఆడియో హక్కులు – ఆదిత్య సంగీతం – రూ.2 కోట్లు
హిందీ డబ్బింగ్ హక్కులు – రూ.5 కోట్లు
టక్ జగదీష్ మొత్తం వ్యాపారం– రూ.51.5 కోట్లు

మరోవైపు నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.

Exit mobile version