శ్యామ్ సింగరాయ్ వంటి సీరియస్ క్యారెక్టర్ తర్వాత.. సుందరంగా తనదైన కామెడీ టైమింగ్‌తో.. ప్రస్తుతం థియేటర్లో అలరిస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ఈ సినిమా తర్వాత ఓ రా మూవీతో రాబోతున్నాడు నాని. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా విషయంలో.. నాని వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మరి నాని కొత్త సినిమా ఎప్పుడు రాబోతోంది.. ఎందుకు డిలే కానుంది..!
నాని లేటెస్ట్ ఫిల్మ్ ‘అంటే సుందరానికి’ జూన్ 10న థియేటర్లోకి వచ్చేసింది. అయితే రిలీజ్‌కు ముందు రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీప్ గెస్ట్‌గా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడంతో.. ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇక రిలీజ్ అయినా తర్వాత పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో నాని మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తర్వాత దసరా అనే ఊరమాస్ సినిమా చేస్తున్నాడు నాని. తన కెరీర్లోనే ఈ సినిమా ‘రా’ గా తెరకెక్కుతోందని చెబుతున్నాడు నాని. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుంది. దాంతో దసరా సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే కొంత వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను.. వచ్చే దసరా పండుగ కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ.. ప్రస్తుతం ఇది సాధ్యం అయ్యేలా లేదని తెలుస్తోంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకాస్త సమయం పట్టేలా ఉందట. దాంతో ఈ చిత్రం దసరా రేస్ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. అయితే అన్ని అనుకున్నట్టు జరిగితే డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఎస్.ఎల్.వి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
