నేచురల్ స్టార్ నాని రేపు అప్డేట్ ఉంటుంది అనేలా హింట్ ఇస్తూ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ అర్థం “టక్ జగదీష్” సినిమా రిలీజ్ డేట్ అని అనుకుంటున్నారు. ఇటీవల కాలంలో “టక్ జగదీష్” సినిమా రిలీజ్ డేట్ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. “టక్ జగదీష్” సెప్టెంబర్ 10న ఓటిటిలో విడుదలవుతుందని ప్రచారం జరగడం, అదే రోజున థియేటర్లలోకి “లవ్ స్టోరీ” రావడం, కరోనా పరిస్థితులు ఈ వివాదానికి కారణం అయ్యాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు నానిపై ఫైర్ అయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ నాని సినిమాలు బ్యాన్ చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత మళ్ళీ వాళ్ళు సారీ చెప్పారు. అది వేరే విషయం అనుకోండి. ఇక ఈ వివాదం తరువాత నిర్మాతలు కూడా ఓ ప్రత్యేకమైన లేఖను విడుదల చేశారు. అందులో “టక్ జగదీష్” కోసం తాము పడుతున్న ఇబ్బందులను, ఓటిటిలో సినిమాను రిలీజ్ చెయ్యాలనుకున్న కారణాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది.
Read Also : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎందుకు ఇన్వాల్ అయ్యిందంటే ?
శివ నిర్వాణ దర్శకత్వంలో “టక్ జగదీష్” తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది దీనిని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం స్వరపరిచారు. కోవిడ్ -19 కారణంగా సినిమా విడుదల ఆలస్యమైంది. రీతు వర్మ కథానాయికగా నటించారు. రేపు నాని అసలు ఏం అనౌన్స్ చేయనున్నాడో అనే విషయం ఆసక్తికరంగా మారింది.