Site icon NTV Telugu

Nani: నేచురల్ స్టార్ తో మరో దసరా…

Nani 31 Will Be A Dark Thri

Nani 31 Will Be A Dark Thri

అసలు న్యాచురల్ స్టార్ నాని బాడీ ట్రాన్సఫర్మేషన్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవాల్సిందే. సినిమా సినిమాకు నాని చూపించే వేరియేషన్ మామూలుగా ఉండదు. దసరా సినిమాలో ధరణిగా, బొగ్గు గనుల్లో మసి పూసుకొని చేసిన మాస్ జాతర మామూలుగా లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోవడమే లేట్.. వెంటనే సాఫ్ట్ లుక్‌లోకి వచ్చేశాడు నాని. జెర్సీ రేంజ్‌లో మరో అదిరిపోయే ఎమోషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాని న‌టిస్తున్న 30వ ప్రాజెక్ట్ హాయ్ నాన్న. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. తండ్రీ కూతుళ్ల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ నేప‌థ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది.

ఇక ఈ సినిమా తర్వాత ‘అంటే సుందరానికి’ మూవీకి దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది కూడా నాని స్టైల్ ఆఫ్ ఎంటర్టైనర్ సినిమానే అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి దసరా డైరెక్టర్‌తో ‘రా’ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట నాని. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. నానిని సరికొత్త లుక్‌లో ప్రజెంట్ చేసి సక్సెస్ అయ్యాడు శ్రీకాంత్. కమర్షియల్‌గా ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అందుకే మరోసారి శ్రీకాంత్ ఓదెలతో కలిసి భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట నాని. ఈ సినిమా కథ కూడా తెలంగాణ నేపథ్యంలోనే ఉంటుందని అంటున్నారు. దాంతో మరోసారి ధరణిలా చాలా రఫ్‌గా కనిపించబోతున్నాడట నాని. మరి ఈసారి ఈ ‘రా’ కాంబినేషన్ ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తారో చూడాలి.

Exit mobile version