Site icon NTV Telugu

The Paradise: పెద్ది, ప్యారడైజ్ కలిసి రావు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్?

Ram Charan Peddi Movie, Nani The Paradise,

Ram Charan Peddi Movie, Nani The Paradise,

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది పారడైజ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నానితో ‘దసరా’ సినిమా నిర్మించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి, ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. ‘పెద్ది’తో పాటుగా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే, ఇంకా రిలీజ్ కి తక్కువ సమయం ఉండటం, ఇంకా ప్రచారం మొదలు కాకపోవడంతో సినిమా రిలీజ్ కాకపోవచ్చు అని అందరూ భావించారు. అయితే తాజాగా ఈ విషయం మీద నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పందించారు.

Also Read :Rashmika Mandanna : ఉదయ్‌పూర్ లో పెళ్లి వేడుక.. రష్మిక కామెంట్స్ వైరల్

ముందుగా అనుకున్నట్టుగానే సినిమా రిలీజ్ చెప్పిన టైంకి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ, ‘పెద్ది’ సినిమాతో పాటు తమ సినిమా వచ్చే అవకాశం లేదని, ఏదైనా రెండు సినిమాలలో ఒక సినిమా మాత్రమే రిలీజ్ చేసేలా ఆలోచిస్తామని అన్నారు. ఆ సినిమా నిర్మాత, తాను కూడా స్నేహితులమే అని పేర్కొన్న ఆయన, ఒకేసారి రావడం వల్ల కలెక్షన్స్ డివైడ్ అవుతున్నాయని అన్నారు. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఐదు సినిమాలు కాకుండా మూడు సినిమాలే వస్తే డిస్ట్రిబ్యూటర్లు లాభపడి ఉండేవారని చెప్పుకొచ్చారు. కాబట్టి వీలైనంత వరకు చెప్పిన డేట్‌కే రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఈ మేరకు షూటింగ్ ప్రక్రియ కూడా చేస్తున్నామని అన్నారు. వీలు కాకపోతే సమ్మర్ అంతా కూడా అవకాశం ఉంటుంది కాబట్టి, పెద్ద సినిమాలు ఏవీ లేవు కాబట్టి సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టుగా ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Exit mobile version