NTV Telugu Site icon

Nani: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు.. నాని ఏమన్నాడంటే.. ?

Nani

Nani

Nani: నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దసరా తరువాత పాన్ ఇండియా లెవెల్లో హయ్ నాన్న సినిమాను రిలీజ్ చేస్తున్నాడు నాని. దీంతో సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నాడు. కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా ప్రెస్ మీట్లు, ఈవెంట్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్లతో రీల్స్, ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ బిజీగా మారాడు. ఇక దీంతో పాటు అభిమానులతో చిట్ చాట్ సెషన్ కూడా స్టార్ట్ చేశాడు. అభిమానులు అడిగిన ప్రతి ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం చెప్పుకొచ్చి షాక్ఇచ్చాడు.

YS Raja Reddy: షర్మిలక్కకు కాబోయే కోడలు.. హీరోయిన్ లెక్క ఉందే..?

హాయ్ నాన్న బోర్ కొట్టాడు కదా.. అంటే .. నిమిషం కూడా బోర్ కొట్టించదు అని చెప్పుకొచ్చాడు. దెబ్బ తగిలిన కన్ను ఎలా ఉంది అంటే.. సెట్ అని, డైరెక్టర్ శౌర్యవ్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే.. అతను చాలా కాలం ఉంటాడు. అతని మరో మూడు రోజుల్లో పరిచయం చేయడం చాలా గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇక తెలంగాణలో ఓటు వేశారు కదా.. తెలంగాణ రిజల్ట్స్ గురించి చెప్పమని అడిగితే.. ” పదేళ్లు బ్లాక్ బస్టర్ సినిమా చూసాం. థియేటర్ లో సినిమా మారింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి హయ్ నాన్న సినిమాతో నాని ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Show comments