శ్యామ్ సింగరాయ్ చిత్రంతో గతేడాది చివర్లో హిట్ అందుకున్న నాని.. ఈ ఏడాది మరో హిట్ కొట్టడానికి సిద్దమవుతున్నాడు. వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన ఈ హీరో ప్రస్తుతం అంటే సుందరానికీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా జంటగా తెరకెక్కుతున్న చిత్రం అంటే సుందరానికీ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. ఇక నేడు ఏ ఈసినిమా టీజర్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వించారు మేకర్స్.. ఈ ఈవెంట్ లో నాని పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ” మీ నుంచి పాన్ ఇండియా సినిమా ఎప్పుడు అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ” పాన్ ఇండియా అంటే ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పడు దేశమంతా మంచి పేరొస్తే .. ఎక్కడెక్కడో వున్న వాళ్లంతా మన తెలుగు సినిమాని చూసి.. ఫోన్ చేసి చాలా బాగుందంటే అది పాన్ ఇండియా కిందే లెక్క. అని చెప్పుకొచ్చాడు.
ఇక తెలుగు, తమిళ్, మళయాళంలోనే రిలీజ్ చేస్తున్నారు కన్నడ లో ఎందుకు రిలీజ్ చేయడం లేదు అన్న ప్రశ్నకు.. సాధ్యమైనంత వరకు మన తెలుగు సినిమాను వేరే భాషల్లో రిలీజ్ చేయరు.. ఎందుకంటె మన భాష వారికి అర్ధం కాదు.. రీచ్ అవ్వదు అని అనుకుంటాం.. అందుకే ఆరి బాషలోనే డబ్బింగ్ చెప్పి విడుదల చేస్తాం.. కానీ మా అందరి బలమైన కోరిక ఏంటి అంటే అక్కడ కూడా మన ఒరిజినల్ వాయిస్ లోనే ప్రజెంట్ చేయాలనీ.. కానీ ఇప్పడున్న పరిస్థితిలో అది కుదరదు. కానీ ఒక్క కన్నడ విషయంలో మాత్రమే అది కుదురుతుంది. ఎందుకంటే కన్నడ ప్రేక్షకులు తెలుగు సినిమాలు బాగా చూస్తారు. వారు తెలుగు సినిమాలను అర్ధం చేసుకుంటారు. వారి కోసం డబ్బింగ్ సినిమాలు ఎందుకు.. ఒరిజినల్ వాయిస్ తో వారే అర్ధం చేసుకుంటారు అని చెప్పి కన్నడ లో రిలీజ్ చేయడం లేదు” అని చెప్పుకొచ్చాడు.
