Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన నాని.. తనకు నచ్చిన విషయాన్నీ నిర్మొహమాటంగా మాట్లాడతాడు. ఎవరు ఏమనుకుంటారు అనేది లేకుండా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఉంటాడు. దీనివలన ఎన్నో వివాదాలలో కూడా నాని ఇరుక్కున్నాడు. ఇక ఈ ఏడాది నేషనల్ అవార్డులు గురించి నాని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెల్సిందే. టాలీవుడ్ అంతా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. జై భీమ్ సినిమాకు అవార్డు రాలేదని నాని బాధపడ్డాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా తెలిపాడు. అప్పట్లో ఈ పోస్ట్ పెద్ద దుమారమే లేపింది. అంటే.. తెలుగు హీరో అయ్యి ఉండి .. తమిళ్ సినిమాను పొగడడం ఏంటి అని చాలామంది ట్రోల్ చేశారు. కానీ, తెలుగు అభిమానుల్లో చాలామంది జై భీమ్ సినిమాకు అవార్డు రాకపోవడంపై బాధపడ్డారు.
Salaar: సలార్ స్పెషల్ నెంబర్ కోసం ‘డర్టీ గాళ్’
ఇక తాజగా నాని ఆ సినిమా గురించి మరోసారి మాట్లాడాడు. నిన్న నాని ఇండియా టుడే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు. ఇక ఆ సమావేశంలో నానికి ఈ ప్రశ్న ఎదురైంది. దాని గురించి నాని మాట్లాడుతూ.. ” నేషనల్ అవార్డ్స్ మా వాళ్లకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆర్ఆర్ఆర్, పుష్ప, మా బ్రదర్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నాడు.. దేవి శ్రీప్రసాద్ అందుకోవడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఈసారి.. చాలామంది మాలో నేషనల్ అవార్డులు అందుకున్నారు. వారందరికీ కంగ్రాట్స్ చెప్తూ పోస్ట్ చేశాను. దాంతో పాటు జై భీమ్ కు అవార్డు రాలేదని కూడా పోస్ట్ చేసాను. నాకు చాలా బాధగా అనిపించింది. జై భీమ్ లాంటి మంచి సినిమాకు అవార్డు రాకపోవడం.. ఏ కేటగిరిలో కూడా ఒక్క అవార్డు రాలేదు. అసలు నేషనల్ ఫిల్మ్ ప్యానెల్ ఆ సినిమా చూసారా లేదా..? అలాంటి సినిమాకు ఒక్క అవార్డు కూడా రాకపోవడమా.. ? చాలా బాధగా అనిపించింది. ఇది వేరేలా అనుకోవద్దు. మా ఇంట్లో మా అక్కకు మంచి మార్కులు వస్తే ఎంత ఆనందపడతానో.. మా పక్కింటి లో ఉండే కజిన్ కు మార్కులు రాకపోతే ఆమెను కూడా ఓదారుస్తాను. అలానే ఆ సినిమా ఎంతో మంచి సినిమా.. దానికి అవార్డు రాకపోవడంతో ఫీల్ అయ్యాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
