NTV Telugu Site icon

Nani: బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ అనే తేడా లేకుండా అందరినీ ఉతికారేసాడు

Dasara

Dasara

పక్కింటి కుర్రాడిలా ఉన్నాడు అనే ఇమేజ్ తో ఇన్నేళ్లు కెరీర్ ని నిలబెట్టుకుంటూ వచ్చిన నాని, సడన్ గా దసరా సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చెయ్యగానే చాలా మంది ఆశ్చర్యపోయి ఉంటారు. అది కూడా ఒక దర్శకుడితో పాన్ ఇండియా సినిమా అంటే నాని రిస్క్ చేస్తున్నాడేమో అనుకున్నారు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్… ఇలా ఎప్పుడైతే ప్రమోషనల్ కంటెంట్ బయటకి రావడం మొదలయ్యిందో, దసరా సినిమా రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్ అవుతుంది అనే టాక్ తెచ్చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఓకే కానీ ఇతర భాషల్లో నాని రాణించడం కష్టమే అన్నారు. ఎందుకంటే హిందీలో అజయ్ దేవగన్ నటించిన భోలా, తమిళ్ లో శింబు నటించిన పత్తు తల, కన్నడలో ధనంజయ నటించిన హోయసాల సినిమాలు కూడా మార్చ్ 30నే రిలీజ్ అవనున్నాయి. ఇతర రాష్ట్రాల్లో అజయ్ దేవగన్, శింబు లాంటి హీరోల సినిమాలు రిలీజ్ కి ఉంటే మన సినిమాలని ఎందుకు పుష్ చేస్తారు నాని దసరా సినిమాని వాయిదా వేసుకుంటే బాగుంటుంది అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఎవరు ఎన్ని చెప్పినా దసరా సినిమాని మార్చ్ 30నే ఆడియన్స్ ముందుకి తెచ్చిన నాని, సాలిడ్ హిట్ కొట్టాడు.

వంద కోట్ల క్లబ్ లోకి చేరిన నానికి దసరా కెరీర్ బిగ్గెస్ట్ గా నిలిచింది. నానికి మాత్రమే కాదు దసరా సినిమా మార్చ్ 30న రిలీజ్ అయిన మిగిలిన మూడు సినిమాల కన్నా అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టింది. అజయ్ దేవగన్ సినిమా 50 కోట్లు కలెక్ట్ చెయ్యడానికి కూడా నానా కష్టాలు పడుతుంది. శింబు సినిమా టాకే యావరేజ్ గా ఉంది, దీనికి తోడు వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విడుదలై’ సినిమా మార్చ్ 31నే రిలీజ్ అయ్యింది. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో, శింబు సినిమాకి కలెక్షన్స్ లేవు. కన్నడలో ధనంజయ పరిస్థితి కూడా దాదాపు ఇదే. హోంబేల్ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేసినా హోయసాల సినిమా చూడడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నట్లు లేరు. ఓవరాల్ గా హోయసాల సినిమా ఇప్పటివరకూ రెండు కోట్లు కూడా రాబట్టలేకపోయింది.

సింపుల్ గా చెప్పాలి అంటే భోలా, హోయసాల, పత్తు తల సినిమాల కలెక్షన్స్ ని కలిపితే నాని దసరా సినిమాకి సమానం అవుతుంది అనమాట. భోలా సినిమా పరిస్థితి అనంతమాత్రంగానే ఉంది, రంజాన్ వరకూ పెద్ద సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కూడా కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో నాని దసరా సినిమాని నార్త్ లో పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ పై కాస్త దృష్టి పెట్టి పుష్ చేస్తే దసరా సినిమా కలెక్షన్స్ లో మరింత ఫెచ్చింగ్ కనిపించే ఛాన్స్ ఉంది. మరి నాని ఆ సైడ్ ఆలోచిస్తాడో లేదో చూడాలి.