నేచురల్ స్టార్ నాని మహమ్మారి సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. నాని తన గత రెండు చిత్రాలను ఓటిటిలో విడుదల చేసినప్పుడు థియేటర్ యాజమాన్యాలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి కష్ట సమయాల్లో అభిమానులు ఆయనకు అండగా నిలిచారు. ఇప్పుడు డిసెంబర్ 24న నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా నాని కోవిడ్ -19 కారణంగా తన అభిమానులను కలుసుకుని చాలా కాలం కావడంతో ఫ్యాన్స్ తో సమావేశం ఏర్పాటు చేశారు. తమ అభిమాన తారను కలిసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 4 వేల మంది అభిమానులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
Read Also : “రాధేశ్యామ్” ఆషికి ఆగయి… సెకండ్ సింగిల్ ప్రోమో
నాని అన్ని టేబుల్స్ చుట్టూ తిరిగి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తన చేతులతో భోజనం కూడా వడ్డించాడు. అభిమానులందరితో ఓపికగా ఫోటోలు కూడా దిగాడు. మీటింగ్ తర్వాత ప్రతి అభిమానికి ట్రెండీ “శ్యామ్ సింఘరాయ్” బ్యాగ్స్ ను బహుకరించారు. బ్యాగ్ లోపల నాని ఫోతోపాటు ప్రత్యేక ఆటోగ్రాఫ్ కూడా ఉంది. నాని ఇచ్చిన ఈ స్పెషల్ ట్రీట్ కు అభిమానులు ఫిదా అయ్యారు. అభిమానులు తమ అభిమాన తారల నుండి ఏమీ ఆశించకుండా వారి కోసం చాలా చేయడం మనం చూస్తాము. నాని వారి కోసం ఇలా చేయడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. వారి ఆనందానికి అవధులు లేవు. ఇండస్ట్రీలో స్టార్స్ ఫ్యాన్స్ కోసం కేర్ చేయడం హెల్తీ ట్రెండ్ అనే చెప్పొచ్చు. ఇలా చేసి నాని కొత్త ట్రెండ్ ను స్టార్ట్ చేశారు.
కాగా తన మొదటి పీరియాడిక్ సినిమా అయిన “శ్యామ్ సింగరాయ్” పెద్ద హిట్ అవుతుందని నాని చాలా నమ్మకంగా ఉన్నాడు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
