“రాధేశ్యామ్” ఆషికి ఆగయి… సెకండ్ సింగిల్ ప్రోమో

“రాధే శ్యామ్” నుండి వచ్చిన మొదటి సింగిల్ “ఈ రాతలే” తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమా ఆడియో ఆల్బమ్‌లోని రెండో పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. “వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్” పేరుతో ‘రాధే శ్యామ్’ ఆల్బమ్ నుండి సెకండ్ సింగిల్ హిందీ వెర్షన్ ప్రోమో ఈరోజు విడుదల కానుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే తాజాగా ‘రాధేశ్యామ్’ నుంచి “ఆషికి ఆగయి” అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ చిన్న సాంగ్ టీజర్ లో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య ఉన్న గాఢమైన ప్రేమ, సముద్ర తీరాన అందమైన విజువల్స్ ను చూపించారు. ఈ రొమాంటిక్ సాంగ్ ను అర్జిత్ సింగ్, మిథున్ పాడారు. లిరిక్స్ తో పాటు.. పాటను కంపోజింగ్ చేసింది కూడా మిథున్ కావడం విశేషం.

Read also : సామ్ “పుష్ప” స్పెషల్ సాంగ్ ఎప్పుడు? ఎక్కడ ?

“వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్” సాంగ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్‌లు రాత్రి 7 గంటలకు విడుదల కానున్నాయి. ఈ పాట తెలుగు వెర్షన్‌ను సిద్ శ్రీరామ్ పాడినట్లు వినికిడి. “రాధే శ్యామ్” 2022 జనవరి 14న థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషించారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.

Related Articles

Latest Articles