Nani : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంలో నాని దిట్ట. అటు హీరోగా ఇటు నిర్మాతగా దూసుకుపోతున్నాడు. నిర్మాతగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అలాంటివి మాత్రమే నిర్మిస్తున్నాడు. రీసెంట్ గానే నిర్మాతగా తీసిన కోర్ట్ మూవీ భారీ హిట్ అయింది. ఆయన హీరోగా చేసిన హిట్-3 కూడా రూ.100 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.
Read Also : Janhvi Kapoor : బాయ్ ఫ్రెండ్ తో లండన్ లో జాన్వీకపూర్ ఎంజాయ్..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. తనకు ఇష్టమైన సినిమా ఏంటో చెప్పేశాడు. ‘నేను పదేళ్లుగా చూసుకుంటే సత్యం సుందరం అనే సినిమా బాగా నచ్చింది. ఆ మూవీలో ఒక సోల్ ఉంది. యాక్షన్ లేదు. రొమాన్స్ లేదు. మాస్ సాంగ్స్, స్టెప్పులు లేవు. సమస్యలన్నీ మర్చిపోయి రెండు గంటలు అలా సినిమా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. అందులో కార్తీ, అరవింద్ స్వామి ఒదిగిపోయారు. వారి పాత్రలు మాత్రమే మనకు అందులో కనిపిస్తాయి. ఆ మూవీ నా మనసుకు బాగా నచ్చింది అంటూ తెలిపాడు నాని.
Read Also : Keerthy Suresh : విజయ్ దేవరకొండతో కీర్తి సురేష్.. హింట్ ఇచ్చిందిగా..
