NTV Telugu Site icon

Nani Raviteja: ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్స్…

Nani Raviteja

Nani Raviteja

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రెజెంట్ స్టార్ హీరో ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు నాని, రవితేజ. ఈ ఇద్దరు హీరోలకి ఉన్న డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ స్కిల్స్ వేరే ఏ హీరోకి ఉండవు. హీరో అంటే సిక్స్ ప్యాక్ ఉండాలి, శిక్ ఫీట్ హైట్ ఉండాలి అనే లెక్కల్ని పూర్తిగా చెరిపేస్తూ నాని, రవితేజలు హీరో అనే పదానికే కొత్త అర్ధం చెప్తున్నారు. పక్కింటి కుర్రాళ్ళలా ఉండే నాని, రవితేజలకి మ్యూచువల్ ఫాన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. ఈ ఇద్దరూ కలిసి సినిమా చెయ్యలేదు కానీ నాని నిర్మించిన ‘అ!’ సినిమాకి మాత్రం రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మాములుగా రవితేజ, నాని ఒకరు ఉంటేనే ఫన్ సూపర్ గా ఉంటుంది, అలాంటిది ఇద్దరినీ ఒకటే చోట ఉంటే ఆ ఎంటర్తైన్మెంట్ ఎలా ఉంటుందో చూపించడానికి నాని, రవితేజలు రెడీ అయ్యారు. నాని నటిస్తున్న దసరా సినిమా మార్చ్ 30న రిలీజ్ అవుతుంది, రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ అవనుంది. ఈ వారం గ్యాప్ లో రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కోసం రవితేజ, నానిలు కలిసారు. ఇద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూ చేసి ఫాన్స్ ని ఖుషి చేస్తున్నట్లు ఉన్నారు. ఈ ఫన్ ఇంటర్వ్యూ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని నాని, రవితేజల, మ్యూచువల్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రవితేజ, నాని కలిసి ఎంత సందడి చేశారు? ఏ ఏ విషయాల గురించి డిస్కషన్ చేశారు? ఎంత ఫన్ జనరేట్ చేశారు అనేది చూడాలి.

Show comments