The Paradise: టైటిల్‌లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?

The Paradise (3)

The Paradise (3)

The Paradise: టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. స్టార్ హీరోలు కూడా రొటీన్ కమర్షియల్ కథలకు భిన్నంగా కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో వచ్చిన కొన్ని సినిమాలను గమనిస్తే ఒక ఇంట్రెస్టింగ్ కామన్ పాయింట్ కనిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’, రామ్ చరణ్ ‘పెద్ది’, ఇప్పుడు నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాల్లో కథా ప్రపంచం వేరైనా.. హీరోలు మాత్రం గుర్తింపు కోసం చేసే పోరాటం సినిమాను పీక్స్ లోకి తీసుకెళ్తుంది. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర సమాజంలో తనకంటూ ఒక స్థానం, గౌరవం, గుర్తింపు సంపాదించుకోవాలనే తపనతో ముందుకు సాగుతుంది. తనను తక్కువగా చూసే వ్యవస్థను ఎదురించి తన స్థాయిని నిరూపించుకోవడమే ఆ పాత్ర ప్రయాణంలో కీలకంగా కనిపిస్తుంది. ఈ పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాలో కూడా తన ఉనికి, తన ప్రజల గుర్తింపు కోసం పోరాటం అనే అంశం ప్రధానంగా కనిపించింది. అయితే ‘పెద్ది’ తన కథ, పాత్రల తీరుతో ప్రత్యేకమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇప్పుడు నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’లోనూ ఇదే తరహాలో గుర్తింపు కోసం జరిగే పోరాటం ఉండబోతున్నట్లు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. తనకోసం మాత్రమే కాకుండా తన ఊరు, తన ప్రజల ఉనికి కోసం పోరాడే కథానాయకుడిగా నాని కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘పుష్ప’, ‘పెద్ది’ తర్వాత అదే కోర్ ఐడియాతో మరో భారీ సినిమా వస్తోందనే చర్చ మొదలైంది. ఇక్కడ యాదృచ్ఛికంగా మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఆకట్టుకుంటోంది. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’.. ఈ మూడు సినిమాల పేర్లు కూడా ‘ప’ అక్షరంతోనే మొదలవుతున్నాయి. అంతేకాదు మూడు కథల్లోనూ తమ ఉనికి, గుర్తింపు కోసం పోరాటం అనే అంశం ఉండటంతో ఈ మూడు సినిమాల మధ్య ఒక కనెక్షన్ ఉందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఇప్పటికే ‘పుష్ప’, ‘పెద్ది’ తమదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించగా.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని అభిమానులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 23 సాయంత్రం ప్రీమియర్ షోల తర్వాత ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో తెలియనుంది. అప్పటివరకు ‘పుష్ప–పెద్ది–ప్యారడైజ్’ మధ్య కనిపిస్తున్న ఈ కనెక్షన్ మాత్రం అభిమానుల చర్చల్లో కొనసాగుతూనే ఉంటుంది.