నటి నజ్రియా నజీమ్ నాని సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈమె రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈమె మలయాళంలో టీవీ ఛానల్ లో వ్యాఖ్యాతగా కూడా పని చేసింది.నజ్రియా తొలిసారిగా 2006లో బాలనటిగా మలయాళం సినిమాలోపరిచయం అయింది.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తమిళం సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించి.. తన నటనకు మంచి గుర్తింపు ను సంపాదించింది.. రాజా రాణి వంటి తమిళ్ డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఆ తర్వాత తెలుగులో తొలిసారిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంటే సుందరానికీ’ అనే సినిమాలో నాచురల్ స్టార్ నాని తో కలిసి నటించింది.ఇక ఈ సినిమాలో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి.
ఇక నజ్రియా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండగా నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకుంటూ తెగ సందడి చేస్తుంది. తనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. తన క్యూట్ పిక్స్ తో అందర్నీ కూడా ఫిదా చేస్తూ ఉంటుంది.నజ్రియా చాలామందికి ఎంతో అల్లరి పిల్లగా కనిపిస్తుంది. సహ నటి నటులతో ఎంతో ఫ్రీ గా ఉంటుంది. అందరితో బాగా కలిసిపోతూ ఉంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఈమె గురించి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.అంటే సుందరానికి సినిమాతో ఈమెకు నాని మంచి ఫ్రెండ్ అయ్యాడు. అయితే నాని గతంలో సుమ షో లో పాల్గొనగా అందులో తనకు సుమ ఒక ప్రశ్న ను వేసింది. నజ్రియా, కీర్తి సురేష్ ఒకేసారి నీకు మెసేజ్ చేస్తే కనుక ఫస్ట్ ఎవరికీ రిప్లై ఇస్తావు అని నానిని అడిగింది.వెంటనే నాని ఏమాత్రం ఆలోచించకుండా నజ్రియా పేరు చెప్పేసాడు.ఎందుకంటే నజ్రియా మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోతే చంపేస్తుంది అని అందుకే ఆమెకు నేను వెంటనే రిప్లై ఇస్తాను అని తెలిపాడు