NTV Telugu Site icon

Nani: నాని ముందు రెండు ఆప్షన్స్?

Nani

Nani

ఏప్రిల్ 5న దేవర సినిమా వస్తుంది అని నందమూరి అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు కానీ ఎలక్షన్స్ కారణంగా దేవర వాయిదా పడుతుంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ దేవర సినిమా దాదాపుగా పోస్ట్‌పోన్ అయినట్టేనని అంటున్నారు. అందుకే… ఆ రోజు విజయ్ దేవర కొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ అవుతోందని చెబుతున్నారు. అయితే… దేవర రూట్‌లోనే ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 కూడా వాయిదా పడుతుందని గట్టిగా ప్రచారం జరిగింది. అంతేకాదు… పుష్పరాజ్ ప్లేస్‌లో దేవర వస్తున్నాడని వినిపించింది కానీ మైత్రీ మూవీ మేకర్స్ వారు క్లియర్‌ కట్‌గా చెప్పేసారు. ఎట్టి పరిస్థితుల్లోను ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇస్తునే ఉన్నారు. అయినా కూడా పుష్ప2 వాయిదా అంటూ రూమర్స్ ఆగడం లేదు.

ఎందుకంటే… బాలీవుడ్‌లో ఇదే డేట్‌కి అజయ్ దేవగన్ నటించిన సింగం సినిమా రిలీజ్ అవుతోంది. సింగం-పుష్ప 2 క్లాష్ పడితే పుష్పకి నార్త్‌లో థియేటర్స్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. ఈ పాయింట్‌ని కన్సిడర్ చేసి… ఒకవేళ పుష్ప2 వెనక్కి వెళ్తే మాత్రం ఆ డేట్‌కి దేవర కాకుండా… నాని వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం నాని నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా రిలీజ్ డేట్‌ను ఆగస్టు 15కి లాక్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్. లేదు పుష్పరాజ్ అనుకున్న సమయానికే వస్తే మాత్రం… ఆగష్టు 29న సరిపోదా శనివారం రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి సరిపోదా శనివారం మేకర్స్ ఈ రెండు డేట్స్‌ను ఆప్షన్‌గా పెట్టుకొని… ఏదో ఒకటి ఫైనల్ చేయాలని చూస్తున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.