Site icon NTV Telugu

Hit3 : తలకు బలమైన దెబ్బ.. అయినా షూటింగ్ ఆపని నాని..

Hit3

Hit3

Hit3 : నేచురల్ స్టార్ నానికి సినిమాల పట్ల ఎంత అంకితభావం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన చాలా సీన్లకు డూప్ ను వాడకుండా ఓన్ గానే చేసేస్తాడు. ఈ నడుమ స్టార్ హీరోలు అందరూ ఇలాగే చేస్తున్నారనుకోండి. అయితే నాని డెడికేషన్ ను చెప్పే ఘటననను తాజాగా డైరెక్టర్ శైలేష్ కొలను వివరించాడు. నాని తాజాగా నటించిన హిట్-3 మూవీ హిట్ టాక్ తో థియేటర్లలో ఆడుతోంది. ప్రస్తుతం మంచి కలెక్షన్లు రాబడుతోంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన హిట్ సిరీస్ లో ఇది థర్డ్ కేస్. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. నాని స్వయంగా నిర్మించాడు. అయితే ఈ మూవీలో నాని దారుణంగా గాయపడ్డాడంట.
Read Also : KKR vs RR: ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో కేకేఆర్ విజయం.. రియాన్‌ పరాగ్‌ మెరుపులు వృధా!

ఈ విషయాన్ని శైలేష్‌ స్వయంగా వివరించాడు. హిట్-3లో ఓ సీన్ లో కొందరు పోకిరీలను నాని ఇరగొట్టే సీన్ ఉంటుంది. ఈ సీన్ లో నాని తలకు బలమైన దెబ్బ తగిలింది. అంతే కాకుండా ఒంటికి నిప్పు కూడా అంటుకుందంట. తలకు కుట్లు పడ్డా సరే నాని రెస్ట్ తీసుకోకుండా వెంటనే వచ్చి షూటింగ్ లో జాయిన్ అయ్యాడని డైరెక్టర్ తెలిపాడు. ఇది నానికి సినిమాల పట్ల ఉన్న డెడికేషన్ అంటూ రాసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వారంతా నానిని అప్రిషియేట్ చేస్తున్నారు.

Exit mobile version