Site icon NTV Telugu

Muthayya: ‘ముత్తయ్య’ టీజర్ ను విడుదల చేయనున్న న్యాచురల్ స్టార్

Mutthayya

Mutthayya

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాలే నడుస్తున్న విషయం విదితమే. వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొనవసరం లేదు. అయితే తాజాగా కొన్ని చిన్న సినిమాలు కూడా తమ సత్తా చాటుతున్నాయి. ఇక ఆ కోవకే చెందుతుంది ‘ముత్తయ్య’ చిత్రం. కె. సుధాకరరెడ్డి కీలక పాత్రలో నటించి భాస్కర్‌ మౌర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ముత్తయ్య’.  హైలైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగమ్‌శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను సమర్పిస్తుండగా, వ్రింద ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇటీవలే యూకేలో జరగనున్న ఏషియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ కి ఎంపికైంది .  మే 9న ఈ చిత్రాన్ని అక్కడ ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రిలీజ్ చేసిన విషయం విదితమే.

ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ని న్యాచురల్ స్టార్ నాని లాంచ్ చేయనున్నారు. ఏప్రిల్ 30 సాయంత్రం 4. 30 నిమిషాలకు  ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఒక టీవీఎస్ బండిపై ఒక వృద్ధుడు కూర్చొని తన మనవడు వయసున్న కుర్రాడి తలలో ఏదో చూస్తున్నట్లు కనిపించాడు. ఇక ఆ కుర్రాడు చేతిలో ఫోన్ పట్టుకొని కూర్చోవడం ఆసక్తిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version