Site icon NTV Telugu

Nani : జున్ను కాలు ఫ్రాక్చర్ అయింది.. నాని ఎమోషనల్

Nani

Nani

Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్లతో జోష్‌ లో ఉన్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన గెటప్ అదిరిపోయింది. దాని గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయంబురా షోకు నాని గెస్ట్ గా వచ్చాడు. ఇందులో తన కొడుకు గురించి జగపతిబాబు ప్రశ్నించగా.. ఎమోషనల్ అయ్యాడు నాని. జున్ను నాకు ఫేవరెట్ కిడ్. వాడు ఎప్పుడూ అందరితో ఎంటర్ టైనింగ్ గా ఉండేవాడు. అలాంటిది కొన్ని రోజుల క్రితం సైకిల్ మీద నుంచి స్కిడ్ అయి కింద పడ్డాడు. వాడి కాలికి ఫ్యాక్చర్ అయింది. అది చూసి చాలా బాధేసింది. వాడు కనీసం బెడ్ మీద నుంచి లేవడానికి కూడా లేకుండా పోయింది. బాత్రూమ్ కు కూడా మేమే తీసుకెళ్లేవాళ్లం అన్నాడు నాని.

Read Also : OG : ఓజీ స్టోరీ ఇదేనట.. కథలో ఇంత డెప్త్ ఉందా..

ఒక్కోసారి అర్ధరాత్రి లేచి ఏడ్చేవాడు. వాడిని చూసుకోవడానికి నాకు, మా వైఫ్ కు సరిగ్గా నిద్ర ఉండేది కాదు. పిల్లలకు దెబ్బ తగిలినా లేదా జబ్బు చేసినా చాలా బాధేస్తుంది. వాళ్లు నవ్వుతూ కనిపిస్తేనే మనకు సంతోషంగా ఉంటుంది. ఓ రోజు అర్ధరాత్రి లేచి నా చేయి పట్టుకుని సారీ చెప్పాడు. ఎందుకు రా అంటే.. నా వల్లే మీకు నిద్ర సరిగ్గా ఉండట్లేదు అన్నాడు. అంత చిన్నవాడైనా కరెక్ట్ గా అర్థం చేసుకున్నాడు. వాడి మెచ్యూరిటీ చూస్తే అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ తెలిపాడు నాని. మొన్న వినాయక చవితి రోజు నాని కొడుకు జున్ను శ్లోకం చదవడం కూడా చూశాం. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

Read Also : RGV – Sandeep Reddy : ఆర్జీవీ ఒక సైతాన్.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్

Exit mobile version