NTV Telugu Site icon

Dasara: నాని సినిమాకి ఈ రేంజ్ ఈవెంట్స్ ఎప్పుడూ చూడలేదు…

Dasara

Dasara

పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ అనే పేరు తెచ్చుకోవడానికి నాని చేస్తున్న సినిమా ‘దసరా’. సింగరేణి బొగ్గుగనుల నేపధ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేస్తున్నాడు. నేను లోకల్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ‘దసరా’ సినిమాపై నాని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ రా అండ్ రగ్గడ్ మూవీతో నాని పాన్ ఇండియా స్టార్ అవుతాడని అందరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నాని లుక్ కూడా నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంది. మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. ఈ మూవీ టీజర్ ని అన్ని ఇండియన్ లాంగ్వేజస్ లో రిలీజ్ చెయ్యనున్నారు. ఈరోజు సాయంత్రం రిలీజ్ కానున్న దసరా మూవీ తెలుగు టీజర్ ని గ్రాండ్ ఈవెంట్ చేసి లాంచ్ చెయ్యనున్నారు. మల్లారెడ్డి కాలేజ్ లో మధ్యాహ్నం మూడు గంటలకి స్టార్ట్ అవ్వనున్న దసరా టీజర్ లాంచ్ ఈవెంట్ SLV సినిమాస్ యుట్యూబ్ ఛానెల్ లో లైవ్ స్ట్రీమ్ అవ్వనుంది.

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజ్ చెయ్యడం దసరా సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ అనే చెప్పాలి. ఇప్పటికే దసరా సినిమా నుంచి ‘ధూం ధాం దోస్తాన్’ అనే సాంగ్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్ అయ్యింది. ఈ హై ఎనర్జిటిక్ సాంగ్ దసరా సినిమా ప్రమోషన్స్ కి మంచి స్టార్ట్ ఇచ్చింది. ఇప్పుడు టీజర్ కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటే నాని సినిమా మార్చ్ 30న బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. నాని మూవీ అనగానే సాంగ్స్, టీజర్, ట్రైలర్ లాంచ్ చేసేసి ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ పెట్టేసి ప్రమోషన్స్ ని క్లోజ్ చెయ్యడం చూసాం కానీ దసరా సినిమా ప్రమోషన్స్ మాత్రం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఫ్యాన్ మీటింగ్స్, ప్రెస్ మీట్స్, టీజర్ లాంచ్ ఇలా మంచి ఊపు మీద ప్రమోషన్స్ చేస్తున్నారు. దసరా సినిమా ప్రమోషన్స్ ఇదే రేంజులో నార్త్ ఇండియాలో కూడా మొదలుపెడితే నాని పాన్ ఇండియా హీరో అయిపోవడం గ్యారెంటీ.