NTV Telugu Site icon

Nani: ప్రేమికుల రోజున హార్ట్ బ్రేక్.. పర్లేదు అబ్బాయిలు

Nani

Nani

Nani: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓడేల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దసరా. నాని.. రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమా మార్చి 30 న అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెల్సిందే. ప్రేమికుల రోజున హార్ట్ బ్రేకింగ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు నాని ఎప్పుడో చెప్పుకొచ్చాడు. “ఓరి వారి.. నీది కాదురా పోరి” అంటూ సాగే సాంగ్ ను ఫిబ్రవరి 13 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నేడు ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోను నాని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ప్రేమికుల రోజున హార్ట్ బ్రేకింగ్ సాంగ్.. ఇట్స్ ఓకే బాయ్స్ అంటూ చెప్పుకొచ్చాడు.

Ananya Nagalla: ఇది అలాంటి ఇలాంటి నడుము కాదు.. చూపులా కనిపించే శృంగార కుడుము

ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. కీర్తి సురేష్ ఇందులో డీ గ్లామర్ రోల్ లో నటిస్తోంది. వెన్నెల అనే పల్లెటూరి అమ్మాయిలా కీర్తి కనిపించనుంది. ఇప్పటికే నాని, కీర్తి కాంబోలో నేను లోకల్ వంటి హిట్ సినిమా వచ్చింది. దీంతో ఈ పెయిర్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అంతేకాకుండా నాని మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమాగా దసరా తెరకెక్కుతోంది. టీజర్ లాంచ్ లో కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ తరువాత ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారు అని నాని చెప్పడంతో అభిమానులు ఈ సినిమాకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా నానికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే.