NTV Telugu Site icon

Dasara: రికార్డ్ హిట్ కొట్టిన నాని… కొన్ని సెంటర్స్ లో స్టార్ హీరోల రికార్డులు గల్లంతు

Dasara

Dasara

లవ్ స్టొరీలు చేస్తూ హిట్స్ ఇస్తూ పక్కింటి కుర్రాడి ఇమేజ్ తోనే స్టార్ హీరో అయ్యాడు నాని. నేచురల్ స్టార్ నానిగా సినీ అభిమానులతో ప్రేమగా పిలిపించుకునే నాని, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కథని నమ్మి, కొత్త దర్శకుడిని నమ్మి, కెరీర్ హైయెస్ట్ బడ్జట్ తో రిస్క్ చేసిన నానికి సాలిడ్ హిట్ దొరికేసింది. దసరా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన నాని, మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు. ముందు నుంచే అంచనాలు భారీగా ఉండడం, నాని అగ్రెసివ్ గా దసరా సినిమాని ప్రమోట్ చెయ్యడం, స్టెల్లార్ కాస్టింగ్ పెర్ఫార్మెన్స్, హ్యూజ్ టెక్నికల్ సపోర్ట్, రా ఎమోషన్స్, రూటెడ్ స్టొరీ, క్యాచీ సాంగ్స్, డెబ్యు డైరెక్టర్ సాలిడ్ మేకింగ్… ఇన్ని కలిసి దసరా సినిమాని ‘ది బెస్ట్’ గా మార్చాయి. క్లైమాక్స్ ఇచ్చిన గూస్ బంప్స్ స్టఫ్ నుంచి బయటకి వచ్చిన ఆడియన్స్ అదే టాక్ ని స్ప్రెడ్ చెయ్యడంతో, దసరా ఈవెనింగ్ అండ్ నైట్ షోస్ కంప్లీట్ గా ప్యాక్ అయ్యాయి. దీంతో నాని ఓవరాల్ గా 38 కోట్ల గ్రాస్ ని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. స్టార్ హీరోల రేంజ్ కలెక్షన్స్ ని నాని ఒక కొత్త దర్శకుడితో రాబట్టడం అంటే మాటలు కాదు.

ఓవర్సీస్ లో వన్ మిలియన్ ని చేరువలో ఉన్న దసరా సినిమా ఒక మాస్ ఉపోరియానే క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలోని కొన్ని సెంటర్స్ లో అయితే కొంతమంది స్టార్ హీరోల రికార్డులని దసరా సినిమా బ్రేక్ చేసి, నానిని టైర్-2 నుంచి టైర్ 1 లోకి ఎంటర్ అయ్యేలా చేసింది. ఓవర్సీస్ లో భారి బడ్జట్ తో రూపొందిన, స్టార్ హీరోల సినిమాలని మించి దసరా సినిమా రాబట్టింది. థియేటర్ బిజినెస్ 50 కోట్ల వరకూ జరిగింది, మొదటి రోజే ఆల్మోస్ట్ సగం రికవర్ అయిపొయింది కాబట్టి బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అవ్వడానికి దసరా సినిమాకి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. రేపు, ఎల్లుండి కూడా వీకెండ్ డేస్ కాబట్టి దసరా బుకింగ్స్ మరింత పెరిగే ఛాన్స్. సో ఇప్పుడున్న ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం దసరా సినిమా మండే నుంచి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వనుంది. ఎట్లైతే, అట్లయ్యింది చూసుకుందాం అని డేర్ చేసిన నాని… మొత్తానికి పాన్ ఇండియా హిట్ ని గుంపగుత్తగా లేపేసాడు.

Show comments