Kalki2898AD: సలార్ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కల్కి2898AD ఒకటి. మహానటి చిత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతీ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మే 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా గురించిన ఒక రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో హీరో నాని, విజయ్ దేవరకొండ క్యామియో చేస్తున్నట్లు నిట్ఠితా పుకార్లు సృష్టించారు. వీరిద్దరే ఎందుకు ప్రత్యేకంగా అంటే.. నాగ్ అశ్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో వీరిద్దరే హీరోలు. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ కు మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. అందుకే.. కల్కిలో వీరిద్దరిని క్యామియోకు తీసుకున్నారని సమాచారం. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. అసలు ప్రభాస్ ఉంటేనే సినిమాకు హైలైట్.. ఇక ఈ సినిమాలో అతిరథ మహారధులే ఉన్నారు. స్టార్ క్యాస్టింగ్ తో సినిమాను మొత్తం ముంచెత్తారు. ఇంకా స్టార్ హీరోల క్యామియోలు అవసరమా.. ? ఇదంతా నమ్మేలా ఉందా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ విషయమై మేకర్స్ స్పందిస్తే బావుంటుదని అభిమానులు అంటున్నారు.
