Nandamuri Tarakaratna: నందమూరి హీరోగా తెలుగుతెరకు పరిచయమైన హీరో నందమూరి తారకరత్న. హీరోగా, విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్న తారకరత్న ఇంకోపక్క తమ పార్టీని కాపాడుకోవడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. టీడీపీ తరుపున ప్రచారం మొదలుపెట్టేశాడు. నేడు గుంటూరు లో జరిగిన ఒక కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తారక రత్న మాట్లాడిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. “పార్టీకి కష్టం వచ్చిన ప్రతిసారీ వెన్నంటి ఉండటమే నందమూరి కుటుంబ లక్ష్యం.. తెలుగుదేశం పార్టీలో పదవుల కోసం నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు ఆశ పడలేదు.
టీడీపీ మా తాతగారు నిర్మించిన పార్టీ.. దానికి కష్టం వచ్చిన ప్రతిసారి నందమూరి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుంది. ఇక మా తమ్ముడు ఎన్టీఆర్ రాజకీయాలోకి వస్తాడు.. ఎన్టీఆర్ అవసరం ఉన్నప్పుడు కచ్చితంగా పార్టీ కోసం నిలబడతాడు.. అవసరం ఉంటే న్టీఆర్ కూడా పార్టీలో ప్రచారానికి వస్తాడు. ప్రస్తుతం నేను ఒక కార్యకర్తగానే ప్రచారం చేస్తున్నాను. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే ఏపీ నుంచే పోటీ చేస్తాను.. ఇక మా గురించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వచ్చినా నేను పట్టించుకోను” అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
