Site icon NTV Telugu

Nandamuri TarakaRatna: పట్టువదలని … నందమూరి తారకరత్న!

tarakaratna

tarakaratna

నందమూరి నటవంశంలో హీరోలుగా ప్రయత్నించిన వారు కొందరే! అయితే వారిలో నటరత్న యన్టీఆర్ వారసులుగా తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ యన్టీఆర్ స్థాయిలో రాణించినవారు లేరు. అయితే నటరత్న మరో మనవడు నందమూరి తారకరత్న చిత్రసీమలో హీరోగా అడుగుపెట్టడంతోనే ఓ రికార్డును తన సొంతం చేసుకున్నారు.

ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఒకే రోజు తొమ్మిది చిత్రాల ప్రారంభోత్సవం చూశారు. ఆ తొమ్మిది చిత్రాలలో తరువాత వెలుగు చూసినవి కొన్నే! అందులో విజయాలు చూసినవి లేవనే చెప్పాలి. అయినా అప్పటి నుంచీ తారకరత్న పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. హీరో పాత్రలే వేస్తానని భీష్మించుకోలేదు. తన దరికి చేరిన ఏ పాత్రలోనైనా నటించడానికి సిద్ధం అంటూ సాగారు. ‘అమరావతి’ చిత్రంలో విలన్ గా నటించి, బెస్ట్ విలన్ గా నంది అవార్డుకు ఎన్నికయ్యారు తారకరత్న.

Exit mobile version