NTV Telugu Site icon

Nandamuri Mokshagna: ఓ.. బాలయ్య.. కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఉందా.. ఎన్నాళ్లు దాస్తావయ్యా.. ?

Balaa

Balaa

Nandamuri Mokshagna: నందమూరి వారసుడు కోసం నందమూరి అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అదేంటీ .. ఇప్పటికే నందమూరి వారసులు ఇండస్ట్రీలో అడుగుపెట్టడం.. హీరోలుగా మారడం జరిగిందిగా అంటే .. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఉన్నాడుగా అని బాలయ్య ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రతి ఏడాది ఇదే రోజు టాపిక్ రావడం జరుగుతూనే ఉంటుంది. ఈరోజు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ పుట్టినరోజు. గత కొన్నేళ్లుగా అతని పుట్టినరోజు.. టాలీవుడ్ ఎంట్రీ గురించి అప్డేట్ ఇస్తారు.. మోక్షజ్ఞ హీరోగా మారుతున్నాడు అని ఆశలు పెట్టుకోవడం, చివరికి అది జరగకపోవడంతో నిరాశ చెందడం అభిమానులకు అలవాటుగా మారిపోయింది. అస్సలు మోక్షజ్ఞకు ఇండస్ట్రీ మీద ఇష్టం ఉందా.. ? లేదా అనే క్లారిటీ కూడా లేకుండా పోయింది. ఎప్పుడు బాలయ్యను వారసుడు గురించి అడిగినా ఈ ఏడాది.. వచ్చే ఏడాది అంటూ మాట దాటేయడం తప్ప.. క్లారిటీ ఇచ్చింది లేదు.
Dhanush: ఆమె వలనే నా జీవితం నాశనమైంది.. ధనుష్ సంచలన వ్యాఖ్యలు

ఇక గతేడాది బాలయ్య.. ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. అప్పుడు మోక్షజ్ఞ బరువు పెరిగి ఉండడంతో. హీరోగా మారడానికి టైం కావాలని చెప్పి .. బాడీ మీద శ్రద్ద పెట్టినట్లు సమాచారం. అనుకున్న ప్రకారమే.. బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ.. కొద్దిగా బక్కచిక్కి.. హీరో లానే మారాడు. అంతేకాకుండా ఇప్పటివరకు చాలా రేర్ గా కనిపించే అతను .. ఈ మధ్య కెమెరా కంటికి బాగానే కనిపిస్తున్నాడు. భగవంత్ కేసరి సినిమాస్ సెట్ లో మోక్షజ్ఞ కనిపించడంతో.. మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను బాలయ్య.. అనిల్ రావిపూడి అప్పగించారని టాక్ వచ్చింది. అయిట అందులో నిజం లేదని తెలుస్తోంది. నేటితో మోక్షజ్ఞకు 29 ఏళ్లు వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేస్తే.. యంగ్ లుక్ పోతుంది అని అభిమానులు భయపడుతున్నారు. పోనీ.. అస్సలు వారసుడు ఎంట్రీ ఉండదు అని క్లారిటీ ఇస్తే దాని గురించి మాట్లాడడం కూడా ఆపేస్తారు. కానీ, బాలయ్య కొడుకు ఎంట్రీ గురించి క్లారిటీ ఇవ్వకుండా ఎన్నాళ్లు ఇలా దాస్తాడు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ఏడాది పోయినట్టే.. మరి వచ్చే ఏడాది ఏమైనా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందేమో చూడాలి.

Show comments